రాజిరెడ్డి, రామచంద్రా రెడ్డిలు క్షేమం

మరణించినట్లు వార్తలను ఖండిస్తూ మావోయిస్టుల ప్రకటన విడుదల

rajireddy-and-ramachandra-reddy-are-fine

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) ‌నాయకులు మల్లా రాజి రెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్లుగా ఆగస్ట్ 19‌న దిన పత్రికలలో వొచ్చిన అబద్ధపు వార్తలను ఖండిస్తూ పార్టీ ఉత్తర సబ్‌ ‌జోనల్‌ ‌బ్యూరో, దండకారణ్యం పేర ఒక ప్రకటనను విడుదల చేసింది. తమ ఇద్దరు నాయకులు క్షేమంగా, సురక్షితంగా ఉన్నారని, కుటుంబ సభ్యులతో సహా వాళ్ల క్షేమం కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తున్న వారందరికీ తెలియ చేస్తున్నామని ప్రకటనలో తెలిపారు. ప్రజలను అయోమయంలో ముంచెత్తడానికి, విప్లవ విజయం పట్ల అవిశ్వౄసం కలిగించడానికి, తమ నాయకుల అనుపానులు తెటుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల కనుసన్నలలో తరచూ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ప్రకటన తెలిపారు.ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *