నేటి సమ కాలీన ప్రపంచంలో ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతు న్నాయి.దీనికి కారణా లేంటి? దీనికి కారణం ఎవరు? ఆత్మహత్య చేసుకోవడానికి,ఆ దిశగా ఆకర్షితులు కావడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అనేది ఒక సారి దీనిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇందులో ముఖ్యంగా ఆత్మహత్యలతో ఎక్కువగా ఉంటున్నవారిలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది.ఉక్కు నరాలు,ఇనుప కండరాలు కలిగిన యువతే దేశానికి ప్రధానం అంటారు.స్వామి వివేకానంద కాని అలాంటి యువతే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.యువతలోమానసిక ఉద్రేకంతో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ కాలంలో యువతలో ధైర్యం సడలి,సమస్యలను ఎదుర్కొలేక,తల్లిదండ్రులకు కొన్ని విషయాలను చెప్పుకోలేక,తమలో తాము మదనపడుతూ కృంగి,కృషించి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.వీటిలో లవ్ ఎఫైర్స్ ఎక్కువగా కనిపిస్తాయి.కొందరిలో ప్రేయసి మోసం చేసిందని, ప్రియుడు మోసం చేసాడని,మార్కులు తక్కువగా వస్తున్నాయని అయితే మరి కొందరిలో తల్లిదండ్రులు మందలించారని,ఉపాధ్యాయులు మందలించారనే ఉద్దేశ్యంతో ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.నేటి కాలంలో ఎక్కువగా మానసిక కుంగుబాటుతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.ఇందులో ఎక్కువగా 25-35 ఏళ్ళలోపు వారు 33%, 15-25 ఏళ్ళ వయసు గల వారు 23%,35-45 ఏళ్ళ వయసు గల వారు 21% ఉండటం ఆందోళన కలిగించే అంశం.అలాగే ఆత్మహత్యలకు పాల్పడే వారిలో 10-15% మంది క్షణికావేశంతో నిర్ణయం తీసుకుంటున్నారు.
మరికొంత మందిని పరిశీలిస్తే పెళ్ళిళ్ళు చేసుకొని చాలీ చాలని జీతాలతో వారి జీవితాలను చీకటిపాలు చేసుకొంటున్నారు.ఆర్ధిక పరిస్థితులు మెరుగు పరుచుకొనే ఆలోచన లేక, ఆధారం లేక, ఎవరి ఆసరా దొరకక అప్పుల ఊబిలో చిక్కుకొని చనిపోతున్నారు.మన దేశానికి వెన్నెముక ‘రైతు’ అంటారు.అలాంటి రైతు నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది.పంట దిగుబడి రావాలంటే పైరుకు ఎరువులు,మందులను అప్పులు తెచ్చి కొడితే చివరకు మార్కెట్లోకి పంటను తీసుకెళ్తే గిట్టుబడి ధర రాక,చేసేది ఏమీ లేక దిగులు చెంది ఉరితాళ్ళకు ఊగుతున్నారు.ఇక వృద్ధుల విషయానికొస్తే అంటే 40 పై చిలుకు వయస్సున్న వారిలో అత్త కోడలు పోరు, అవ్వ బిడ్డల పోరు, అయ్యకొడుకుల తగాదాలు,అన్నదమ్ముల తగాదాలు ఇలా ఉన్నాయి.భూమి కొరకు తగాదాలు,ఆస్థి కొరకు అల్లరులు, నీడలేని నిరుద్యోగ యువకులు, అనాథల ఆర్తనాదాలు,ఆకలి కేకలు ఇవన్నీ కూడా క్షణికావేశంలో మానసిక క్రుంగుబాటుతో ఆత్మహత్యలకు గురవుతున్నారు.ఇలాంటి ఆలోచన ఉన్నవారు నిద్రపోరు, తెల్లవారుజామున 3-4 గంటలకే లేచి కూర్చుంటారు.ఆహారం సక్రమంగా తీసుకోరు.క్రమేణ బరువు తగ్గుతుంటారు. ఏ పనిలోను ఉత్సాహం చూపరు.పనులు వాయిదా వేస్తుంటారు. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. నేను చేయలేను, ఇది నావల్ల కాదు,నాతోనే ఇంట్లో ఉన్నవారికి కష్టాలు,ఈ జీవితం దండగ,చనిపోతే బాగుండు అనే ఆలోచనతో తమ (విలువైన) అమూల్యమైన జీవితాన్ని అబాసుపాలు చేసుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే తాగుడుకు బానిసై, చెడు వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను పోషించక,మీ మానాన మీరు బతకండి అన్నపుడు ఆ తల్లి, పిల్లలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పురుగుల మందు తాగో,తినో తాను, తన పిల్లలు కానరాని లోకాలకు వెళ్తున్నారు.కొంత మందిలో సూటి పోటి మాటలు వినడం ఇష్టంలేక, పడడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది మానసిక వైకల్యం,కుంగుబాటు, ఆందోళన,దురలవాట్లకు బానిసవడం వంటి వాటితోనేఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో ఆత్మహత్య అనే ఆలోచన అప్పటికప్పుడు రాదు.
ఏదో ఒక సందర్భంలో సన్నిహితులు, స్నేహితులు కుటుంబ సభ్యుల వద్ద వారు పడుతున్న కష్టాలను వేదనను, వారి దృష్టికి తీసుకు వచ్చినపుడు వారి మాటలను ఇతరులు తేలిగ్గా తీసుకోవడం వల్ల అది ఆచరణ వరకు వస్తుంది. దీనికి ఇతరులు అప్పుడే ధైర్యం చెప్పి అండగా ఉంటే ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఉండనే ఉండదు.దేనికైనా ఓపికుండాలి,సమస్యలు లేని (ప్రాణి) మనిషి లేడు.మనిషికే కాదు భూమి పైన ఉన్న ప్రతి ప్రాణికి కూడా దేని సమస్య దానికుంది. కష్టాలు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొవాలి. ఎదుర్కోవాలంటే గుండెను సైతం బండరాయి. చేసుకోవాలి.కొన్నింటిని వదిలేయాలి. కొన్ని త్యాగాలు చేయాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయ త్నం చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా నీ ముందు చిన్నదిగానే కనిపిస్తుంది.మహామహులకే తప్పలేదు అవమానాలు, అవరోధాలు, ఆటం కాలు అలాంటి వారు ఎలా పైకెదిగారు అనేది ఆలోచించాలి.మన టార్గెట్ ఏదైతే అనుకొంటామో ఆ టార్గెట్ మీద మనసు పెట్టు,జీవితం హాయిగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. అందుకే ఆత్మహత్యలు వద్దు,ఆప్యాయత, అనురాగాలే ముద్దు,ఇలాగే అన్నింటినీ భరిస్తు• ఒడిదోడుకులను ఎదుర్కోని జీవితాన్ని ముందుకు సాగించాలి.అపుడే జీవితానికి ఓ సార్ధకత వస్తుంది.
మెటె చిరంజీవి
సామజిక వేత్త, 9949194327




