యురేనియం ఊబిలో నల్లమల్ల అడవి ప్రాంతం…

ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరున మనిషి భావితరాల మనుగడకు ముళ్ళకంచలాంటి బాటలు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలకు నిర్మూలనకు ఒక పెట్టని కోట వలె దక్కన్‌ పీఠభూమిలో దాగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఎన్నో రకాల వన్య  ప్రాణులకు, అటవీ ఉత్పత్తులకు వాటి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ఒక ఆవాస ప్రాంతంగా ఉంటూ మరియు పర్యాటకులకు కనువిందు చేసే ఒక సుందర వనమై వికసిస్తున్నది. యురేనియం అనే ఒక మానవ వినాశనాకారి నల్ల మల్ల అడవి ప్రాంతం మీద యు సి ఎల్‌ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్నేసినది. యురేనియం వెలికితీత ముసుగులో ప్రజా ప్రతినిధులు కాంట్రాక్టర్లు వారితోపాటు లంచగొండి అవినీతి అధికారులు చేతులు కలిపి స్వచ్ఛమైన ఇలాంటి కల్మషం లేని అడవి బిడ్డల బతుకుల్ని అంధకారంలోకి నెట్టి వేయబడే ఒక కుట్ర నల్లమల అడవి ప్రాంతం మీద పగబట్టింది.

యురేనియం వివరణ
1789లో పిచ్‌ బ్లెండ్‌ అనే ఒక ఖనిజం నుండి యురేనియంను వెలికి తీయవచ్చు అనే విషయాన్ని కనుగొన్నారు ఆ తరువాత 1896 సంవత్సరంలో హేన్డ్రి బేకరల్‌. అనే శాస్త్రవేత్త యురేనియం నుండి వెలుపడే రేడియోధార్మిక శక్తిని కనుగొన్నారు ఈ రేడియోధార్మిక శక్తిలో ఆల్ఫా గామా బీటా కిరణాలు ఉంటాయని విషయం సమాజానికి తేటతెల్లమయింది.  ఈ ఆల్ఫా, బీటా, గామా కిరణాల నుండి అసాధారణమైన శక్తి విడుదలై వీటి ద్వారా న్యూక్లియర్‌ ఎనర్జీ ఉత్పన్నం అవుతుంది.న్యూక్లియర్‌ ఎనర్జీని అనుబాంబుల తయారీలో రాకెట్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ లో ఇంధనంగా వాడుతారు. ఇవి శాస్త్ర సాంకేతిక రంగాలలో ఒక పురోగమన అభివృద్ధిగా భావించవచ్చు మరియు యురేనియం ద్వారా వెలుపడే ఆల్ఫా, బీటా, గామా,కిరణాలు వైద్య , పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు.

యురేనియంను న్యూక్లియర్‌ రియాక్టర్‌ చే మండిరచి విద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. 1950 దర్శకంలో అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్‌ నెహ్రూ మన దేశంలో ఏడు యురేనియం బావులను మరియు 22 న్యూక్లియర్‌ రియాక్టర్ల ఏర్పాటును ప్రతిపాదించగా 1967 సంవత్సరంలో జార?ండ్‌ రాష్ట్రంలోని జూదుగూడా అనే ప్రాంతంలో యురేనియం బావిని ప్రారంభించారు.ఈ బావి నుండి వెలుపడే వ్యర్ధాల మూలంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక రకాల అనారోగ్య పరిస్థితులకు గురికావడం మనందరికీ తెలిసిన విషయమే… జూదుగుడా యురేనియం బావి మూసివేతకు అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను కాపాడడం కోసం ఎన్నో రకాల ఎన్జీవో సంస్థలు సర్వే వివరాలను ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది. ఎన్జీవోస్‌ ఇచ్చిన నివేదికలో వాసవాలు తెలుసుకోవడం కోసం అప్పటి ప్రభుత్వం  దీARజశాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఎన్జీవోస్‌ ఇచ్చిన నివేదిక యురేనియం తవ్వకాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయడం జరిగింది బార్క్‌ నివేదికను ఆధారంగా చేసుకుని జూదుగూడలో కొన్ని సంవత్సరాలు యురేనియం తవ్వకాలు యధావిధిగా కొనసాగాయి.

1998 సంవత్సరంలో వాజ్‌ పాయ్‌ ప్రభుత్వం అక్కడ ప్రజలు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ మరియు రైతు ఉద్యమాలకు తలోగ్గి జూదుగూడ యురేనియం బావిని మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. తదనానంతరం భారత ప్రభుత్వం యు సి ఐ ఎల్‌ ఆధ్వర్యంలో 2007 నవంబర్‌ 27న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామంలో మరియు గుంటూరు జిల్లా కొప్పునూరు గ్రామంలో దాదాపు లక్ష అరవై వేల టన్నుల యురేనియం ఖనిజాన్ని వెలికి తీశారు. తరువాత అక్కడ నిలువలు అయిపోవడం మూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్ను పచ్చని అడవితో ప్రకృతి కనువిందులతో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసే నల్లమల అడవి ప్రాంతంపై పడడం జరిగింది. యురేనియం నిల్వలు ఉన్నట్లు యూ సి ఐ ఎల్‌ గుర్తించింది. ఈ త్రవ్వకాల కోసం దాదాపు 5 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నారు.. కానీ యురేనియం ద్వారా వెలువడే వ్యర్ధాలు కృష్ణా నదిలో కలిస్తే మానవాళి,వన్యప్రాణుల మరియు అక్కడ నివసించే గిరిజన ప్రాంత ప్రజల మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. యురేనియం ద్వారా వెలుపడే రసాయనాలు గాలిలో కలవడం వల్ల గాలి విషతుల్యమాయి దాని ప్రభావం దాదాపు 8 మైళ్ల దూరం వరకు వ్యాపిస్తుంది అలా వ్యాపించిన విషతుల్యమైన గాలిని పీల్చుకోవడం వలన ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి కావలసిన విషయం మన అందరికీ జార?ండ్‌ రాష్ట్రంలో జూదుగుడా ప్రాంతంలో తేటతెల్లమయింది. ఇలాంటి సమాజ వినాశనకారి అయినా యురేనియం వెలికితీత నిర్ణయాన్ని వెంటనే ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము.
-రాగిపాని బ్రహ్మచారి
9542464082

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *