హైదరాబాద్, పిఐబి, జూన్ 23 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యుఎస్‌ఎలో తన ఆధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం వైట్ హౌస్‌ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్‌లు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన అమెరికన్‌లు వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన మంత్రి తదనంతరం, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలసి పరిమిత మరియు ప్రతినిధి వర్గం స్థాయి సమావేశాలలో ఉపయోగకరమైన చర్చలో పాల్గొన్నారు.
నేతలు ఇద్దరూ రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతూ వొస్తున్న మైత్రి, వ్యాపారం, పెట్టుబడి, రక్షణ, శక్తి, జలవాయు పరివర్తన మొదలుకొని ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి రంగాల వరకు విస్తరిస్తున్న సహకారాన్ని గురించి చర్చించారు. ఇరువురు నేతలు సంబంధాలను ఒక నూతన శిఖరానికి చేర్చడం కోసం ఒక బలమైనటువంటి ప్రాతిపదికను అందించేటటువంటి ఉభయ దేశాల మధ్య గల పరస్పర విశ్వాసం, అవగాహనలతో పాటు ఉమ్మడి విలువలను గురించి కూడా చర్చించారు. వారు క్రిటికల్ ఎండ్ ఇమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసిఇటి) వంటి కార్యక్రమాల మాధ్యమం ద్వారా శీఘ్ర పురోగతి చోటుచేసుకొంటూ ఉండడాన్ని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని తట్టుకుని నిలబడగలిగేటటువంటి సరఫరా వ్యవస్థలను నిర్మించడం కోసం వ్యూహాత్మకమైన సాంకేతిక విజ్ఞాన సంబంధిత సహకారాన్ని పెంపొందించుకోవాలన్న ప్రగాఢమైన అభిలాష పట్ల ప్రశంసను వ్యక్తపరచారు. వారు మహత్వపూర్ణ ఖనిజాలు, అంతరిక్ష రంగా లలో సహకారం పెంపొందుతూ ఉండడాన్ని స్వాగతించారు.


