‌మేనిఫెస్టో..మా మేనిఫెస్టోపై చర్చిద్దామా

కర్ణాటక నుంచి కొట్టుకొచ్చి కాపీ కొట్టి పెట్టారు
గత ఎన్నికల్లో హాలు ఎందుకు ఇవ్వలేదో
చంద్రబాబును పొగడడానికే మహానాడు పెట్టారు
మండిపడ్డ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని

విజయవాడ,మే29 :చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో బోగస్‌ అని మాజీమంత్రికొడాలి నాని మండిపడ్డారు.  2014, 2019 నాటి  మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో? ఏపీ సీఎం జగన్‌ ఏం ‌చేశారో చర్చిద్దాం అంటూ నాని సవాల్‌ ‌చేశారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌వాళ్లు ఇచ్చిన హాలను కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ హా ఇచ్చారు. ఆల్‌ ‌ఫ్రీ బాబు అని వైఎస్‌ఆర్‌ ‌గతంలో అనే వారు.  2014లో చంద్రబాబు 650 వాగ్దానాలు చేశారు. వాటిని అమలు చేయిస్తామని మోదీ, పవన్‌ ‌కల్యాణ్‌ అప్పట్లో చెప్పారు. మరి వాటిని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు. రైతు రుణమాఫీ అని చెప్పి కనీసం పది శాతం కూడా చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత చదువులు, నిరుద్యోగ భృతి అని చెప్పి ఏవైనా చేశారా? విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తానని చెప్పి ఇచ్చారా? అని నాని ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌ ‌వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏ చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్‌ ‌శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారన్నారు. ఆ తర్వాత తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా అని కొడాలి నాని ప్రశ్నించారు. అసలు ఎన్టీఆర్‌ ‌వారసుడైన బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదన్నారు. లోకేష్‌ ‌పాదయాత్రకు వెళ్లి చనిపోయిన తారకరత్న ఫోటో ఎందుకు పెట్టలేదని,  కేవలం చంద్రబాబును పొగిడించుకోవటానికే మహానాడు జరిగిందన్నది అందరికీ తెలుసని అన్నారు. మహిళలకు 15 వందలు ఇస్తానని అంటున్నారు. ఆల్రెడీ జగన్‌ ఇస్తున్నారు ఇక చంద్రబాబు ఇచ్చేదేంటి? వార్డు సభ్యులుగా గెలవలేని వారు కూడా మహానాడు వేదిక ద మమ్మల్ని దూషించారు. బీసీలను నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్‌. ‌వారు కూడా ఎన్టీఆర్‌ ‌ని దైవంగా చూశారు. అలాంటి వారిని వెన్నుపోటు పొడిచారు. ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న బీసీల కోసం చంద్రబాబు ఏం చేశారు? జగన్‌, ‌వైఎస్‌ఆర్‌ 40 ‌లక్షల ఇళ్లు బీసీల కోసం కట్టించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌ని చంద్రబాబు వేధిస్తున్నారు. సినిమాలు రాకుండా నిర్మాతలను బెదిరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *