మేడారం అమ్మవార్లను దర్శించుకుంటా

హహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సిఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : ఫిబ్రవరి 23న మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి మేడారం పూజారుల సంఘం సభ్యులకు తెలిపారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని మేడారం ఆలయ పూజారుల సంఘం  శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వొచ్చే నెలలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, సంబంధిత పనులపై దేవాదాయశాఖ అధికారులు సీఎం రేవంత్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *