మెదక్‌ వేదికగా నేడు సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం

మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి హరీష్‌ రావు

మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 22:  అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని,  కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు  పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ.. మెదక్‌ లో పదికి పది సీట్ల గెలుపు పక్కా. సీఎం కేసీఆర్‌కి గెలుపు బహుమతిగా ఇస్తామన్నారు.  16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా, ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, టేకేదార్లకు కూడా పింఛను ఇచ్చే కార్యక్రమం సీఎం కేసీఆర్‌ మెదక్‌ వేదికగా ప్రారంభిస్తారని చెప్పారు.  దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లు కూడా అందిస్తారు. తర్వాత  జిల్లా కలెక్టరేట్‌ లో అధికారులతో మాట్లాడుతారు. 3గంటల సమయంలో సభ కు హాజరు అవుతారు.

సీఎం కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు తెలిపే సభ ఇది. టిఆర్‌ఎస్‌ పాలనలో మెదక్‌ రూపు రేఖలు మారాయి.  ఈ రాజకీయ పార్టీ కూడా ఓకే సారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలేదు. కేడర్‌ అంతా ఉత్సవాలు జరుపుతున్నాయని మంత్రి ఆనందం వ్యక్తం చేశాయి.  కాంగ్రెస్‌ వాళ్లకు  లీడర్లు లేరు, బిజెపి వాళ్ళకు  కేడర్‌ లేదు.  యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బి ఆర్‌ ఎస్‌ కు పెద్ద ఎత్తున జై కొడుతున్నారు. సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే.  దేశం మెచ్చే విధంగా కేసీఆర్‌ పాలన ఉంది. తెలంగాణ పథకాలను బిజెపి కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది.  కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా కేంద్రం కాపీ కొట్టింది. మనం గుర్తు ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తే, కేంద్రం లోన్ల రూపంలో ఇస్తుందట. బిఆర్‌ఎఎస్‌ కు , బిజెపికి ఉన్న తేడా ఇదే అన్నారు.

అంతకుముందు అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి.  బుధవారం సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు.  మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్‌ అండ్‌ బి, ప్రజాప్రతినిధులు,  అధికారులతో సమీక్షించారు. బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని సందర్శించి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.  ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు, పలు విభాగాల అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *