మెడికల్ సీట్లు మూడు రెట్లు పెరిగాయి ..

  • విద్యార్థులు ఇతర దేశాలు పోవాల్సిన అవసరం లేదు ..
  •  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  వరంగల్ లో ఉండడం గర్వకారణం
  • పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు 
వరంగల్,ప్రజాతంత్ర,మే 31: వరంగల్ నగరం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్    పనులు వేగంగా జరగాలని అధికారులను మంత్రి హరీష్ రావు  ఆదేశించారు..వెయ్యి మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం బుధవారం  మీడియా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులతో కలిసి మాట్లాడారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..2100 పడకలు వచ్చేలా డిజైన్ మార్పు చేశామని, 800 పడకలు సూపర్ స్పెషల్ బెడ్స్ ఉన్నాయని, 14 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం పూర్తయిందన్నారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయని, 36 రకాల స్పెషాలిటీ   సేవలు అందిస్తామని, వరంగల్ నుండి హైదరాబాద్ కి వైద్యం కోసం పోవాలిసిన అవసరం  లేదన్నారు. నిమ్స్ లో, ఇతర  కార్పొరేట్  హాస్పిటల్ లో ఎలాంటి అత్యాధునిక  సేవలు  ఉన్నాయి… అవన్నీ వరంగల్  సూపర్  స్పెషలిటీ లో అందనున్నాయని, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా  హాస్పిటల్ చుట్టూ 6 లైన్ రోడ్ నిర్మాణం చేపడుతూనే..ఎమర్జెన్సీ సర్వీసుల కోసం  అంబులెన్స్ లు ట్రామా కేర్  లోకి సులువుగా  వెళ్ళే విధంగా  ఉండేందుకు  ప్రత్యేకమైన  డెడికేటెడ్ రహదారి, ఎంట్రెన్స్ లు ఉంటాయన్నారు.
కిడ్నీ, లివర్ తదితర  మార్పిడి చికిత్స లు జరిగినప్పుడు  పేషంట్  బంధువులు  ఉండేందుకు వీలుగా హాస్పిటల్ ఆవరణలో  250మంది ఉండే విధంగా  అన్నీ సౌకర్యాలతో ధర్మా శాల  నిర్మాణం  ఏర్పాటు చేస్తామన్నారు . 4800 కిలో వాట్స్ పవర్  సప్ప్లై కి అనుగుణంగా 6000 కిలో వాట్స్ సామర్ధ్యం గల జనరేటర్స్  ఏర్పాటు,  1200  కిలో లీటర్  ల సామర్ధ్యం తో  ఎస్టీపీ  ప్లాంట్ ఏర్పాటు, 800కిలో లీటర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు, 400 మంది రెసిడెంట్ డాక్టర్లకు స్పెషల్ రూమ్స్, 450మందితో  సమావేశం పెట్టగలిగేలా  కాన్ఫెరెన్స్ హల్ ఏర్పాటు, హెల్త్ యూనివర్సిటీతో పాటు,  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  వరంగల్ లో ఉండడం గర్వకారణం అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు  వరంగల్ లో ఒకే ఒక్క కేఎంసీ  ఉండేది.. ఈరోజు 7 మెడికల్ కాలేజ్ లో ఈ విద్య  సంవత్సరం లో అందుబాటులో కి వస్తున్నాయన్నారు. ఇంకా ఒక్కటి మెడికల్ కాలేజ్ ములుగు లో వచ్చే  విద్య సంవత్సరానికి  ఇవ్వబోతున్నామని, వరంగల్ పై సీఎం కేసిఆర్ కు ప్రత్యేక అభిమానం అని, ఒకప్పుడు  నియోజకవర్గం గా ఉన్న ములుగు లో సైతం ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డ్. అన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు వల్ల  పేద  విద్యార్థులకు వైద్య విద్యo  తో పాటు, ఒక్కో కాలేజ్ తో 2000 మందికి  ఉపాధి  దొరకనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల  ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసాం. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ములుగు, భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు  చేయటం  దేశం లోనే రికార్డు. రిమోట్  ఏరియా లో ని  ప్రజలకు  కూడా అత్యుత్తమ సేవలు  అందించాలని  మన ముఖ్యమంత్రి   ఆలోచన. ఆ ప్రాంతం పిల్లలు అక్కడి కాలేజ్ లోనే చదవడమే  మా లక్ష్యం. రాష్ట్రం ఏర్పడినప్పుడు 2958 మెడికల్  సీట్లు ఉంటే కానీ ఇప్పుడు 8340  సీట్లకి అడ్మిషన్ లు చేయబోతున్నాం.
దాదాపు 3 రేట్లు  సీట్లు పెరిగాయి. వైద్య విద్య  కోసం రష్యా  కో.. చైనాకో పోవలిసిన అవసరం లేదు. మన  రాష్ట్రం లోనే చదువుకునే  అవకాశాన్ని  మన ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ  హాస్పిటల్ లలో  డెలివరీ శాతం  70 వరకు నమోదు  అవుతున్నాయి. కేసీఆర్ కిట్, ఆరోగ్లక్ష్మి,, న్యూట్రిషన్ కిట్, డాక్టర్ ల నియామకం  ఇవన్నీ సౌకర్యాలు కల్పంచడం  వల్ల  ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ ల మీద నమ్మకం  పెరిగింది. వైద్యం కోసం ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలను కేటాయించడం  వల్ల వైద్య సేవలు మెరుగు పడ్డాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చాలా కష్ట పడుతున్నారు.. ఇదే  స్ఫూర్తి తో 70 శాతం  నుండి మరింత  శాతం  ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రసావాలు సంఖ్య  పెరిగేలా కృషి  చేయండి. చాలా రాష్ట్రా లలో ఇంకా ఇళ్ల వద్దే డెలివరీ లు జరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రం లోనే వంద కు వంద శాతం  ఇన్స్టిట్యూషన్ డెలివరీ లు అవుతున్నాయని  కేంద్రం గుర్తించి అభినందించింది. మీడియా సమావేశంలో  ఎంపీ దయాకర్, మేయర్ గుండు సుధారాణి ,  ఎమ్మెల్సీ  పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, శాసన సభ్యులు ఆరూరి  రమేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *