ఆందోళనకు దిగిన గిరిజనులు
ఇంఫాల్, అగస్ట్ 19 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం, ముగ్గురు మృతి చెందడంతో అక్కడ ఆందోళనలు ఆగడం లేదు. తెలిసిందే. ఉఖ్రుల్ జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో వందలాది మంది మహిళలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. వీరి ధర్నా శనివారం కూడా కొనసాగుతోంది.
ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మునపటిలా శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కొండ ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్‌ను మోహరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని గిరిజన ఐక్యత కమిటీ డిమాండ్ చేసింది. కొండ జిల్లాల మాదిరిగానే మణిపూర్‌లోని అన్ని లోయ జిల్లాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏని విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ‘ఇటీవలే తొలగించిన ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏ ని వీలైనంత త్వరగా తిరిగి అమలు చేయాలని మేము కోరుకున్నాము. లిటన్ ప్రాంతం నుండి అస్సాం రైఫిల్స్ తొలగింపు నిన్న హత్య జరగడానికి ఒక కారణం’ అని గిరిజన ఐక్యత కమిటీ వి•డియా సెల్ కోఆర్డినేటర్ అన్నారు.




