తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఊపిరిపోసుకుంది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఏర్పడ్డ తెలంగాణాలో దుబాయి, బొగ్గుబాయి బతుకులు బాగుపడ్డాయో లేదో కానీ ముంబాయి బతుకుల్ని పట్టించుకున్న దాఖాలాలే లేవు.
వైస్సార్ హయాం నుండే తెలంగాణ నుండి ముంబాయికి వలసలు కాస్త తగ్గినా, ముంబాయిలో స్థిరపడ్డ తెలంగాణ ప్రజల బతుకుల్లో కించిత్ మాత్రం కూడా మార్పురాలేదు. గల్ఫ్ కష్టాల గురించి ప్రభత్వం పట్టించుకుంటున్నట్లుగా, చర్చలు జరుపుతున్నట్లుగా అప్పుడప్పుడు వార్తలు చదువుతుంటాం కానీ, ముంబై తెలంగాణ బతుకు వెతల గురించి ఏ నాయకుడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ముంబై, భీవండి పరిసర ప్రాంతాల్లో దాదాపు 12 లక్షల మంది తెలంగాణవాసులున్నారు. ఇందులో దాదాపు 8 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులున్నాయి, కుటుంబాలున్నాయి.. రాకపోకలున్నాయి.. బంధువర్గం ఉంది. ముంబై, భీవండి నుండి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి. సుదీర్ఘమైన సరిహద్దు ప్రాంతం ఉంది. వోట్లపరంగా చూస్తే ముంబై పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డ ఈ 8 లక్షల మంది తెలంగాణ ప్రజలు, తెలంగాణాలో ఉన్న తమ కుటుంబాల ద్వారా ఎన్నో లక్షల మందిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ‘‘ముంబైవాళ్లు తెలంగాణాకు వచ్చి వోటేసేది ఉందా..? పాడా..? వాళ్ళను ఎందుకు పట్టించుకోవడం..?’’ అని తెలంగాణ పార్టీల నాయకుల అభిప్రాయం కావొచ్చు. కానీ, ముంబై తెలంగాణ ప్రజలు నాటిలాగా ఎడ్డిలోకంలో లేరు. ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. వారికి వోటు విలువ తెలుసు.. పార్టీల వైఖరి కూడా తెలుసు. ఎవరికి వోటెయ్యాలి..? ఎవరికి వోటు వేయించాలో కూడా తెలుసు.
ముంబై పరిసర నగరాల తెలంగాణ ప్రజల వెతల్ని తెలంగాణా ప్రభుత్వం పట్టించుకొని, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలనీ గతంలో ఎన్నో వినతి పత్రాలు సమర్పించాం. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ ఎన్నికల సందర్భంగా మరోసారి తెలంగాణాలో అధికారం కోసం పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు ఇక్కడి సమస్యల గురించి తెలియచెప్పాలనుకుంటున్నాం.
రవాణా సౌకర్యం మెరుగుపరచాలి
ముంబై నుండి ప్రతిరోజూ కొన్ని వేల మంది తెలంగాణాకు రాకపోకలు సాగిస్తారు. కానీ, ఒక్కరైలు కూడా సక్రమంగా లేదు. దాంతో ప్రైవేట్ బస్సుల పై ఆధారపడాల్సి వస్తోంది. ప్రైవేట్ బస్సు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ బస్సులు ఒకప్పుడు ఉండేవి. కానీ ఆ డొక్కు బస్సులు ఎప్పుడు దార్లో ఆగిపోతాయోననే భయంతో ప్రయాణీకులు వాటికి దూరంగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులతో మాట్లాడి రైలు సదుపాయాన్ని కలిగించాలి. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

తెలంగాణ సాంస్కృతిక భవనం నిర్మించాలి
ముంబైలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల సాంస్కృతిక భవనాలున్నాయి. తెలంగాణా భవనం / తెలుగు భవనం తప్ప..! అజ్మేర్ లాంటి కొన్ని పరాయి రాష్ట్రాల్లో తెలంగాణ భవనాల్ని నిర్మించారు కానీ, ముంబైని మాత్రం విస్మరించారు. తెలంగాణా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభత్వాన్ని సంప్రదిస్తే, మిగతా రాష్ట్రాలకు కేటాయించినట్లుగానే తెలంగాణ భవనానికి స్థలాన్ని కెటాయించే అవకాశాలున్నాయి.

ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలి
ముంబై విశ్వవిద్యాలయంలో కొంకణి, ఉర్దూ, మళయాళం లాంటి భాషలకు కూడా పీఠాలున్నాయి. కానీ, తెలుగు మాత్రం అంతటి మహద్భాగ్యానికి నోచుకోలేదు. విద్యాసాగర్ రావు గవర్నర్ గా ఉన్నప్పుడు ఎన్నోమార్లు కలిసి వినతి పత్రం సమర్పించాం కానీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తెలుగు పీఠం లేకపోవడం వల్ల తెలుగు టీచర్ల ట్రేనింగ్, పరిశోధన, నియామకాలు జరగడం లేదు. దాంతో ముంబైలో తెలుగు పాఠశాలలు క్రమక్రమంగా మూతబడుతున్నాయి. తెలుగు బడులు మూతబడడానికి మరెన్నో కారణాలున్నా, టీచర్ల నియామకం జరగకపోవడం ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. వివిధ అంశాలపై పరిశోధన చేయాలనుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు సాహిత్యం కుంటుపడిపోతోంది.

విద్యార్థులు ఎదుర్కొంటున్న నాన్ లోకల్ సమస్య తీర్చాలి
ముంబైలో చదువుకున్న విద్యార్థి అనుకోని కారణాల వల్ల తెలంగాణాలో ఉన్నత చదువులు చదవాలనుకుంటే లోకల్ నాన్ లోకల్ సమస్యని ఎదుర్కొంటున్నారు. రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. చిత్రమేమంటే, తరతరాలుగా ముంబైలో స్థిరపడ్డప్పటికీ కొన్ని పథకాలను పొందాలంటే ముంబైలో కూడా తెలంగాణ ప్రజలకు డొమిసైల్ సర్టిఫికెట్లు తదితర పత్రాలను డిమాండ్ చేస్తున్నారు. రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలి.

ముంబై మిల్లు కార్మికులకు ఉపాధి కల్పించాలి
ముంబైలో మిల్లులన్నీ మూతబడడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో, ముంబైలో బతకలేక తెలంగాణాకు తిరిగి వెళ్ళాలనుకునే కార్మికులకు తెలంగాణాలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. టెక్స్టైల్ పార్క్ లాంటి వాటిలో ప్రాధాన్యత ఇవ్వాలి. స్వగ్రామంలో స్థిరపడాలనుకునేవారికి రేషన్ కార్డులు, తతిమ్మ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

తెలుగు సంఘాలకు ఆర్థిక సహాయం అందించాలి:
తెలంగాణాలో అన్ని కులాలకు సంక్షేమ భవనాలు నిర్మించి ఇవ్వడమే కాకుండా, ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ముంబైలో కూడా పలు కుల సంఘాలున్నాయి. తెలంగాణ సంస్కృతిని, భాషను పోషిస్తున్నాయి. మిల్లులు మూతపడడం వల్ల ఆ సంఘాల నిర్వహణ కష్టసాధ్యమవుతోంది. అలాంటి సంఘాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి.

సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయాలి:
తెలంగాణాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే బతుకమ్మలాంటి మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు జిల్లాల వారిగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దాదాపు 8 లక్షల తెలంగాణ ప్రజలున్న ముంబైని కూడా మరో జిల్లాగా గుర్తించి అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయం అందించాలి.

ట్యాంక్ బండ్ మీద ముంబై
తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్టించాలి
హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఎందరెందరో మహనీయుల విగ్రహాలు ప్రతిష్టించారు. కానీ, ముంబై నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి, సామాజిక, రాజకీయం రంగాల్లో చెరగని ముద్ర వేసిన శీలం సయాజీరావు లాంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేసి తగిన గౌరవాన్ని కల్పించాలి.

రచయితలకు ప్రోత్సాహాన్నివ్వాలి
తెలంగాణాకు చెందిన శతాధిక కవులు, రచయితలు ముంబైలో సాహితీ సేవలు అందిస్తున్నారు. ఇందులో ఎందరో పేద రచయితలున్నారు. వారి పుస్తకాల ప్రచురణకు ఆర్థిక సహాయం చేసేందుకు, అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ఒక త్రిసభ్య కమిటీ వేసి ఆదుకోవాలి.

కుల దృవీకరణ పత్రాల నియమాలను సరళీకృతం చేయాలి
ముంబైలో 90 శాతం మంది తెలంగాణాకు చెందిన బీసీలే ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం కులాలు ఎస్బీసీ (స్పెషల్ బ్యాక్వర్డ్క్లాస్) కు చెందిన వారే ఉన్నారు. అయితే, 2 శాతం రిజర్వేషన్లు ఉన్న ఈ ఎన్బీసీ శ్రేణిలో క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలంటే చుక్కలు చూపిస్తున్నారు ఇక్కడి అధికారులు. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారులను మంత్రులను సంప్రదించి, ఆ సర్టిఫికెట్లు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని విధానపరమైన మార్పులు చేసి ఆదుకోవాలి.
ముంబైలో ఉంటున్నప్పటికీ వీరంతా తెలంగాణా బిడ్డలే..! రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చూపుతున్న వివక్ష వల్ల కొట్టుమిట్టాడుతున్న ఈ తెలంగాణా ప్రజల సమస్యల్ని తీర్చేందుకు తెలంగాణా ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆశిద్దాం..!
ఇక వోట్లంటారా..? ముంబై తెలంగాణ ప్రజలు తెలంగాణ వోటర్లను లక్షల సంఖ్యలో ప్రభావితం చేయలగలిగే స్థితిలో ఉన్నారన్నది నిజం..!!

– సంగెవేని రవీంద్ర
ముంబై, 9987145310