మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు క్లియర్‌

లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టుల్లో ఉన్నవాటికి నో

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గత 2020లో స్వీకరించిన లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారీగా దరఖాస్తులు వెల్లు వెత్తాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం మార్చి 31 వరకు క్రమబద్దీకరణకు వీలు కల్పించింది. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూము లను తప్ప ఇతర లే అవుట్స్‌ను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది దరఖాస్తు దారులకు లాభం చేకూరనున్నది.

లేఔట్ల భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసు కొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా చేసిన లే అవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్దీకరించుకునేందుకు సర్కార్‌ మరోసారి అవకాశం కల్పించింది. అనధికార లే ఔట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మాణానికి అనుమతులు రాక, అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ క్రమంలో ఆ లే ఔట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ తీసుకు రాగా ఈ విషయంపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలం నుంచి ఈ పక్రియకు బ్రేక్‌ పడిరది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లే ఔట్ల కోసం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. కేవలం అనుమతి లేని లే ఔట్లను మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ద్వారా రెగ్యులరైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *