అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచికను ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రారంభించారు.వివిధ రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధినిపరిశీలించడమే దీని ముఖ్యఉద్దేశ్యం. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాల నడుమ వ్యత్యాసాలను పరిశీలించి ప్రతీ సంవత్సరం ఒక నివేదిక ద్వారా ఇది తెలియ చేస్తుంది. ఈ నివేదిక ద్వారా ప్రపంచస్థాయిలో దేశాల ఆర్థికస్థితిగతులనే కాకుండా ఆయా దేశాలలోని సామాన్య ప్రజానీకానికి అందుతున్న మౌలిక సదుపాయాలు, ప్రజలు ఏవిధమైన జీవనం సాగిస్తున్నారు.
అనేది కూడా తెలుసుకోవచ్చు..దీనికి ప్రామాణికంగా దేశ సగటు తలసరి ఆదాయం, విద్య, ఆయుర్దాయాలను మరియు పర్యావరణంపై ఒత్తిడిని పెంచుతున్న అంశాలను కూడా ఈ సూచిక పరిగణలోకి తీసుకుని నివేదికను రూపొందిస్తుంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) తాజాగా ‘‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’’ పేరుతో రూపొందించిన నివేదికలో ఆందోళన కలిగించే విషయాలు బయట పడ్డాయి. కొవిడ్ సృష్టించిన విలయంతో ప్రపంచ దేశాలు వణికిపోయాయి. చాలా దేశాల ఆర్థికస్థితి గతి తప్పింది. ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్ మహమ్మారి నుంచి కొన్ని దేశాలు కోలుకుంటున్నాయి.దీని కారణంగానే గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ మానవాభివృద్ధి విషయం లో ఐదేళ్లు వెనక్కి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (ఖచీణ•) వెల్లడించింది.
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలలో మానవాభివృద్ధి సూచీ క్రమంగా పెరుగుతూ ఉండగా కోవిడ్ విజృంభించిన సమయంలో వరసగా రెండేళ్లు 2020, 2021లో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు నివేదిక వెల్లడించింది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలు చూసినప్పటికి తాజాగా ఎదురైన పరిస్థితులు మాత్రం మానవాభివృద్ధిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపాయని గత 32 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి క్షీణించడం ఇదే మొదటిసారని నివేదికలో పేర్కొంది.ఈ కారణంగా ఆయా దేశాల్లో ఆయుర్దాయం, విద్యా స్థాయిలు , జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడించింది.
ప్రస్తుతం ఇది ఏ ఒక్క దేశానికో ఈ పరిస్థితి పరిమితం కాలేదని, ప్రపంచంలోని 90 శాతం దేశాలు దీనిబారిన పడ్డాయని ఈ నివేదిక వెల్లడించింది. మానవాభివృద్ధి సూచీ వరుసగా రెండేండ్లు పాటు తగ్గుదల నమోదు చేసుకోవడం ఇదే తొలిసారిగా జరిగినట్లు నివేదిక లో పేర్కొన్నారు.మానవాభి వృద్ది సూచిక.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై ప్రభావం చూపినట్లే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన మన దేశంలో కూడా, మానవాభివృద్ధి సూచిలో మాత్రం దిగజారింది. 2020లో భారత మానవాభివృద్ధి సూచి 0.642 ఉండగా, 2021కి 0.0633కి పడిపోయింది. 1990 నుంచి సూచి క్రమేపి పెరగ్గా 2019లో తగ్గింది. ఆ తర్వాత 2020లో 0..003 పాయింట్లు పడిపోగా, 2021లో 0.009కు దిగజారింది. అయితే 43 దేశాలతో ఉన్న మాధ్యమ మానవాభివృద్ధి కేటగీరిలో మాత్రం తన స్థానాన్ని నిలుపుకుంది. క్రితం సారితో పోలిస్తే 2021లో ఓ ర్యాంకు దిగజారినట్లు నివేదిక వెల్లడించింది.తాజాగా 191 దేశాలకు నిర్వహించిన దానిలో భారత్ 132 స్థానంలో ఉందని పేర్కొంది. దీనివలన గతం కన్నా మన దేశంలో మానావాభివృద్ది క్షీణించింది.అంటే భారతదేశం కంటే మానవాభివృద్ధిలో 131 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్థికంగా అంతగా అభివృద్ధి చెందని దేశాలు కూడా భారత్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి.ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక విషయంలో పొరుగు దేశాలు భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. పొరుగు దేశాలు శ్రీలంక(73), చైనా(79), బంగ్లాదేశ్(129), భూటాన్(127)లు సూచిలో భారత్ కన్నా ముందు వరుసలో ఉన్నాయి. నేపాల్(143), మయన్మార్(149), పాకిస్తాన్(161) దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్విట్జర్లాండ్ మాత్రం మానవాభివృద్ధిలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. నార్వే, ఐస్‌లాండ్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ సూడాన్, చాద్, నైజర్ దేశాలు అట్టడుగున నిలిచాయి.
భారత్ లో పాఠశాల విద్య అంచనా సంవత్సరాలు 11.9 సంవత్సరాలు అయితే సగటు సంవత్సరాలు 6.7గా నమోదైంది. ఒక దేశం యొక్క ఆరోగ్యం, విద్య, సగటు ఆదాయం యొక్క కొలమానమైన మానవ అభివృద్ధి సూచిక వరుసగా 2020, 2021 రెండు సంవత్సరాలు క్షీణించింది. అంతకుముందు ఐదు సంవత్సరాల పురోగతికి వ్యతిరేక దిశగాసాగుతోంది.ఇక దీనిలో… స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.ప్రపంచం మొత్తం మీద ఈ సంక్షోభాలను కొన్ని దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా , దక్షిణాసియా , కరేబియన్ ప్రాంతంలోని కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేక పోతున్నాయని నివేదిక సారాంశం. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలను మరింత ముదిరేలా చేశాయని నివేదిక పేర్కొంది.
రుద్రరాజు శ్రీనివాసరాజు.
9431239578
లెక్చరర్…ఐ.పోలవరం




