హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబ్ 27 : బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. సోహెల్ పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్‌ను పోలీస్ స్టేషన్‌కు పంపించాడు. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి వెళ్లిపోయిన సోహెల్.. అక్కడి నుంచి దుబాయ్‌కి పారిపోయాడు. ఈ క్రమంలో సోహెల్ కోసం పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌లో ఉన్న సోహెల్‌ను రప్పించేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుక్ఔట్ నోటీసులు





