Take a fresh look at your lifestyle.

మహిళలు రాజకీయంగా ఎదగాలి..

భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవునికి మహిళ యొక్క గొప్పతనం తెలుసు. పుట్టిన ప్రతి ఒక్కరికి మహిళలు పడే బాధలు తెలుసు. మహిళ అంటేనే ఒక దేవత ఆ దేవతను గౌరవించాల్సిన అవసరం ఉంది.
మహిళ అంటే అబల కాదు బల అని నిరూపిస్తున్న నిరూపించిన మహిళలు చాలామంది ఉన్నారు. నవ మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన వీర నారీమణులకు మనం రోజు మొక్కాల్సిందే ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందన్న వాక్యం వందకు వంద శాతం నగ్నసత్యమే. ఆడది లేకుంటే మగవాడు ఏ పని చేయలేడు,సోమరి పోతుగానే ఉంటాడు.తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిరంతరాయంగా పనిచేసే గొప్ప వీరవనిత మహిళ.విశ్వమంతటికీ మహిళనే గొప్ప దేవత.మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం అదేవిధంగా మన బాధ్యత కూడా.
కేవలం వంటింటికి మాత్రమే పరిమితమా…
సమాజంలో చాలామంది మదిలో ఉండేది ఇదే. మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అని ఇంటి పని చూసుకుంటే సరిపోతది అని కానీ, ఇది మాత్రం ముమ్మాటికీ తప్పే ఎందుకంటే కేవలం మగవాడే ఉద్యోగం చేయాలని మహిళలు మాత్రమే ఇంట్లో ఉంటూ వంట పని ఇంటి పని చేస్తూ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసిపెట్టి లేదు. ప్రతి మహిళకు ఉద్యోగం చేయాలని డబ్బులు సంపాదించాలని పెద్దపెద్ద సమావేశాలలో మాట్లాడాలని అనుకుంటారు.కానీ ఈ కోరికలు మాత్రం కొంతమంది మహిళలలో మాత్రమే నెరవేరుతున్నాయి.చాలామంది మహిళల కోరికలు లక్ష్యాలు మాత్రం బూడిదలో పోసిన పన్నీరు లాగానే మారిపోతున్నాయి.ముందుగా ప్రతి మగవాడు చేయాల్సింది ఒక్కటే మహిళలకు నచ్చినది ఏంటో కనుక్కోవాలి,ఆమెకు వెన్నంటే ఉండి ప్రోత్సహించాలి.అప్పుడే సమాజంలో మహిళలకు గౌరవం అనేది పెరుగుతుంది.మహిళ తలెత్తుకొని గౌరవంగా బ్రతుకుతుంది.
రాజకీయంగా ఎదగాలి:
మగవాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులుగా ఉండాలని, రాజకీయం చేయాల్సి ఉందని,ఏమీ లేదు. కానీ మహిళలు రాజకీయంగా అణగద్రొక్కబడుతున్నారు.మహిళలు రాజ్యాధికారం అనుభవించాలి. రాజకీయంగా ఎదగాలి. మరింతమంది మహిళలకు ఆదర్శంగా నిలవాలి. కొంతమంది మహిళలు రాజకీయంగా ఎదుగుతున్నప్పటికీ చాలామంది మహిళలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.మహిళలకు రాజకీయాల గురించి అవగాహన కల్పించి ప్రజాస్వామ్యంలో పౌరులకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం చేస్తూ ఒక ఆదర్శవంతమైన మహిళ నాయకురాలిగా పేరు తెచ్చుకోవాలి.
మధ్యలోనే చదువును ఆపకూడదు:
పూర్వం బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవి. ఈ కాలంలో బాల్య వివాహాలు జరిగే సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది,కానీ ప్రస్తుతం ఆడవాళ్లకు 21 సంవత్సరాలు దాటితే చాలు చదువును మధ్యలోనే ఆపించి వివాహాలు చేస్తున్నారు.ఇలా చదువుకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయకూడదు.తల్లిదండ్రులు అవగాహన తెచ్చుకోవాలి.పిల్లల యొక్క అభిరుచులను తెలుసుకోవాలి.
భ్రూణ హత్యలు ఆపాలి:
ఆడపిల్ల అంటేనే కడుపులోనే చిదిమేస్తున్నారు.ఈ కాలంలో కొంతమంది తల్లిదండ్రులు.ఆడపిల్ల అంటేనే ఇంటికి మహాలక్ష్మి ఇంటికి వెలుగు కూడా.అలాంటి మహాలక్ష్మిని బయట ప్రపంచాన్ని చూడనివ్వకుండా చేస్తున్నారు.ప్రాణం పోసుకున్నప్పటి నుండి ఆ మహిళ యొక్క ఆశలను కడుపులోనే అంతం చేస్తున్నారు.పుట్టిన ప్రతి ఆడబిడ్డ మహిళనే కానీ ఆ మహిళ జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుంది. కావున భ్రూణ హత్యలను ఆపాలి మహిళా లోకాన్ని బ్రతికించాలి.మహిళలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేలా పాటుపడాలి.     కేవలం మహిళా దినోత్సవాల రోజునే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళలు ప్రజాస్వామ్యంలో గౌరవించబడాలి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలి మహిళలు కూడా రోడ్డుపైన స్వచ్ఛందంగా తిరిగే రోజులు రావాలి.ప్రతి మహిళను తన సోదరి వలె ప్రతి ఒక్క మగవాడు భావించాలి.మహిళలు తమ సత్తాను చాటుతూ ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్రను పోషిస్తారని దానికి ఇతర పురుషలోకం సహకరిస్తారని కోరుకుంటున్నాను..
image.png
వెంగల రణధీర్‌
‌జయశంకర్‌ ‌భూపాలపల్లి
9949493707

Leave a Reply