పాల్గొన్న మాజీ మంత్రి ఆదిత్య థాకరే
ముంబై, నవంబర్ 7 : రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా జరిగాయి. భారత్ జోడో యాత్రలో శివసేన పాల్గొంటుందని ఉద్ధవ్ థాకరే సైతం ఆదివారం జరిగిన డియా సమావేశంలో ప్రకటించారు. అయితే తాను హాజరయ్యే అవకాశాలు మాత్రం తక్కువేనని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ, షిండే గ్రూప్, ఎంఎన్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే మహా వికాస్ అఘాడి బలపడాల్సిన అవసరం ఉందని, ఆ కారణంగానే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలనే నిర్ణయం శివసేన తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ సైతం డియా సమావేశంలో ఎన్‌సీపీ, శివసేన ప్రముఖ నేతలు ఈ యాత్రలో పాల్గొంటారని ప్రకటించింది. అయితే, బిజీ షెడ్యూల్, ఇతరత్రా కారణాల రీత్యా ఎవరెవరు ఈ యాత్రలో పాల్గొంటారనేది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే, నేరుగా ప్రజలను కలిసి వారికి మరింత చేరువయ్యేందుకు అవకాశం ఉండటంతో పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొనేందుకు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. కాగా, భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోని ఐదు జిల్లాలోను కలుపుతూ 14 రోజుల పాటు 384 కిలోటర్లు సాగనుంది. నాందేడ్, హింగోలి, వాసిం, అకోలా, బుల్దానా జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది. అకోలా జిల్లాలోని యాత్ర మార్గంలో కారులో రాహుల్ ప్రయాణిస్తారు. పలు సామాజిక సంస్థలు కూడా ఈ యాత్రలో పాలుపంచుకోనున్నాయి.




