వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రతలతోనే వ్యాధి వ్యాప్తి
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 219 మిలియన్ల కేసులు…4 లక్షల మరణాలు
ఆగస్ట్ 20 ప్రపంచ దోమల నివారణ దినం
ఇండియాలో కరోనా అలలు ముగిసిన వేళ, నేడు మలేరియా, డెంగ్యూ లాంటి పలు సీజనల్ వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి. 139 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలు అనేక ఏండ్లుగా వెంటాడుతున్నాయి. జనాభా పెరుగుదలతో పేదరికం అధికమవుతూ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అవిద్య కారణంగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత లోపించడంతో పలు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వానాకాలంలో తొలకరి జల్లులతో పాటు దోమలు, ఈగలు లాంటి రోగకారక జీవులతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు తీవ్రంగా ప్రబలడం సర్వ సాధారణమని వైద్యాధికారులు వెల్లడిస్తారు. వానాకాలంలో మురికి నీటి నిల్వలతో దోమలు, లార్వాలు పెరగడంతో పాటు దోమ కాటు బారిన పడే జనుల అధికమవుతారు.
రొనాల్డ్ రోస్ పరిశోధనలు
20 ఆగష్టు 1897న నోబెల్ బహుమతి(1902) గ్రహీత ‘సర్ రొనాల్డ్ రోస్’ చేసిన ఆవిష్కరణ ప్రకారం ఆడ అనాఫిలిస్ దోమ కాటుతో మలేరియా వ్యాధి సంక్రమిస్తుందనే అతి ప్రధానమైన పరిశోధనా ఫలితాలను వివరించారు. మలేరియా వ్యాధి దోమకాటుతో సోకుతుందనే ప్రధాన ఆవిష్కరణను వివరించిన రోనాల్డ్ రోస్ ప్రకటన చేసిన రోజుకు గుర్తుగా ప్రతి ఏట 20 ఆగష్టున ‘ప్రపంచ దోమల నివారణ దినం (వరల్డ్ మస్కిటో ఎరాడికేషన్ డే)’ పాటించుట ఆనవాయితీగా మారింది. దోమ కాటుతో సంక్రమించే ప్రాణాంతక వ్యాధుల్లో మలేరియా అతి ముఖ్యమైనది. మలేరియా వ్యాధి బారిన పడుతున్న పేద ప్రజలు అధిక శాతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదకర మలేరియా వ్యాధి పట్ల అవగాహన పెంచుకుందాం.

దోమ కాటుతో సోకే వ్యాధులు:
దోమ కాటుతో ప్రాణాంతక మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, ఫైలేరియాసిస్, యెల్లో ఫివర్, జీకా లాంటి వ్యాధులు సోకుతాయి. ఈగలతో సంక్రమించే వ్యాధుల్లో డిసెంట్రీ, డయేరియా, టైఫాయిడ్, కలరా, హెల్మెంథిస్ లాంటివి అంటుకుంటాయి. పూర్తిగా, సమర్థవంతంగా నివారించగల, వైద్యంతో సులభంగా నయం చేయగల మలేరియా రోగంతో ప్రతి ఏటా మిలియన్ల ప్రజలు బాధపడుతున్నారు . ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట 219 మిలియన్ల మలేరియా కేసులు, కనీసం 4 లక్షల మలేరియా కారణ మరణాలు నమోదు అవుతున్నాయి.

మలేరియా వ్యాధి ప్రబలడానికి కారణాలు
దోమకాటుతో సంక్రమించే మలేరియా వ్యాధి ఓ ప్రపంచ తీవ్ర ప్రాణాంతక సమస్యగా గుర్తించబడింది. ప్రపంచ మలేరియా కేసుల్లో సబ్-సహార ఆఫ్రికా దేశాల్లో మలేరియా కారణ మరణాలు(ముఖ్యంగా పిల్లలు, మహిళలు) 90 శాతం వరకు నమోదు అవుతున్నాయి. దోమకాటుతో వ్యాప్తి చెందగల మలేరియా వ్యాప్తికి వర్షాలు, నిలువ నీరు, వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, అపరిశుభ్ర పరిసరాలు లాంటి కారణాలను చెప్పవచ్చు. మలేరియా సోకిన వ్యక్తిని కాటు వేసిన దోమలు తిరిగి ఆరోగ్యవంతులను కాటు వేయడంతో మలేరియా వ్యాధి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. ఏకకణజీవి ప్లాస్మోడియం పరాన్నజీవి సోకిన వ్యక్తులకు మలేరియా రోగం వస్తుంది.

మలేరియా వ్యాధి లక్షణాలు
మలేరియా సోకిన వ్యక్తులకు తలనొప్పి, చలిజ్వరం, కండరాల నొప్పి, శరీర నోప్పులు, సోమరితనం, నిస్సత్తువ లాంటి రోగ లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణి స్త్రీలకు, గర్భంలోని శిశువు ఎదుగుదలకు మలేరియా అతి ప్రమాదకరమని తెలుసుకోవాలి. ఐదురకాల మలేరియా పరాన్నజీవుల్లో ప్లాస్మోడియం ఫాల్సిఫరమ్ పరాన్నజీవితో సంక్రమించే మలేరియా అత్యంత ప్రమాదకరమైనది. రోగి నుండి మరో ఆరోగ్యవంతుడికి నేరుగా మలేరియా సోకదు, కాని దోమకాటుతో మాత్రమే రోగం సోకుతుంది. సకాలంలో చికిత్స అందని యెడల వ్యాధి తీవ్రమై రక్తహీనత, జాండిస్, మెంటల్ కన్ఫ్యూజన్, కిడ్నీ ఫెయిల్యూర్, కోమాతో పాటు చివరకు మరణం కూడా కలగవచ్చు. రక్తంలో చేరిన పరాన్నజీవి కాలేయం, ఎర్ర రక్తకణాలను ప్రభావితం చేస్తుంది. మలేరియా సోకిన వ్యక్తికి సరైన వైద్యం సకాలంలో అందనియెడల ప్రాణం పోవడం ఖాయమని తెలుసుకోవాలి. మలేరియా పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించిన 7-18 రోజుల్లో రోగలక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స లభించని కేసుల్లో దీర్ఘకాలిక రోగాలు కలుగవచ్చని కూడా గమనించారు.

మలేరియా వ్యాధి నిర్థారణ
మలేరియా నిర్థారణ పరీక్షగా రక్తంలో మలేరియా పరాన్నజీవి ఉనికిని తెలుసుకొనే ‘మలేరియా రాపిడ్ డయగ్నాస్టిక్ టెస్ట్’ నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్థారణ అయిన తరువాత నయం చేయడానికి సమర్థవంతమైన ఆంటీ-మలేరియా ఔషధాలు ఇవ్వబడతాయి. విచక్షణ మరిచి మలేరియా ఔషధాలను వాడితే దుష్ప్రభావాలు అతి తీవ్రంగా ఉంటాయి. 2018లో మలేరియాకు ఆర్‌టియస్, యస్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాలను మలేరియా అధికంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో శిశువులకు, పిల్లలకు అందిస్తారు.

మలేరియా నివారణ మార్గాలు
మలేరియా కారణ దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రత, మురుగు నీరు నిలువ లేకుండా చూడడం, శరీర అవయవాలను పూర్తిగా కప్పుకునేలా దుస్తువులు ధరించడం, దోమ తెరలు వాడడం, దోమలను తరిమే ఆధునిక/సహజ మస్క్విటో రిపెలెంట్స్ వాడడం, రోగ లక్షణాలను గమనించడం, సత్వరమే చికిత్స చేయించుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లాంటి చర్యలు చేపట్టాలి. పలు వ్యాధుల నివారణకు కారణాలుగా సురక్షిత నీరు వాడడం, పరిసరాల/వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అంటువ్యాధుల అవగాహనతో జాగ్రత్తగా ఉండడం లాంటి చర్యలు తీసుకోవాలి. దోమలు, లార్వాలను నివారించడం, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్త పడడం, సకాలంలో చికిత్స తీసుకోవడం లాంటి చర్యలతో మలేరియా వ్యాధిగ్రస్తులో కనిపించని (జీరో మలేరియా) ప్రపంచాన్ని నిర్మించుకుందాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి,
కరీంనగర్ – 9949700037
కరీంనగర్ – 9949700037