మనస్సు తరుక్కుపోయే.!

పరిగెడుతూ పరిగెడుతూ
ఎక్కడికి పోవాలని
శరీరమంతా చెమటతో
పొర్లుతూ
ఎక్కడికి పోవాలని
పోతున్నావ్‌
‌పోతున్నావ్‌..!

ఎక్కడికి వెళ్ళాలని
అనుకున్నావ్‌
‌మట్టి వాసన పీల్చుటకు
నీవు గర్వపడవా..?

గట్టిగానే అనుకున్నావ్‌
‌గానీజి
పట్టుకున్నా పట్టుకున్నా
నీవేమి అనుకున్నవ్వు
మనస్సు అంతా
తేలికగా ఉన్న
ఏదో ఒకటి మర్చిపోయా
అనుకున్నా కానీ
నా గుండె తరుక్కుపోయే
పలువురు
అనుకుంటున్నా మాటలు
ఎక్కడికి పోతున్నావ్‌
ఎక్కడికి వెళ్తున్నావ్‌..!
‌పలుకు తేట మాటలు
తూటాల్లా పేల్చుతున్నావ్‌
‌విని ఎరగని తుపానులా
ముందుకు సాగిపోతున్నావ్‌
‌మా హృదయాల నుండి
నువ్వు వెళ్ళద్దు
ఎక్కడికి పోవద్దు…
– గిద్దలూరు సాయి కిషోర్‌
               అనంతపురం జిల్లా,
               రాయదుర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *