‌మట్టికిచ్చిన మాట కోసం తెలంగాణ పార్టీ గెలవాలె..!

తెలంగాణ సాధించి తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన చింతమడక బిడ్డ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అం‌దించిన సుపరిపాలన పై తెలంగాణ సమాజం తీర్పు ఇవ్వడానికి సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది.అధికారంలో ఉండి ప్రజా ఆశీర్వాద సభలో తన పరిపాలనపై ప్రజల తీర్పు కోరడం భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేదు.అటువంటిది మొదటి సారిగా తెలంగాణలో తాను అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై వేదిక ద్వారా ప్రజాభిప్రాయం కోరాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రజల వద్దకు వెళుతున్నారు.66 ఎండ్ల పాలనలో సబ్బండ వర్ణాలకు  ఏ పార్టీ అందించని సంక్షేమం దశాబ్ద కాలంలో అందించిన నమ్మకంతో  ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తన పాలన లేదని వచ్చి ఎన్నికల్లో వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ప్రతిపక్షంలో ఉంటామని, రెస్ట్ ‌తీసుకుంటామని అచ్చంపేట సభ ద్వారా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే మొదటి దశ ప్రచారం పూర్తీ అయ్యింది. రెండవ దశలో కేసీఆర్‌ అసాధారణమైన రీతిలో స్వయంగా కాలుకు బలపం కట్టుకొని రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలకు ఈ దశాబ్దంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ముఖ్యం కాదు.గెలుపు, ఓటమి సహజంకానీ, ప్రజాస్వామ్యం గెలువాలనేది అయన ఆకాంక్ష. నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వస్తుంటారు, పోతుంటారు కానీ సభకు వచ్చిన జనం ఎవరూ ఏమి చెప్పారు? సభ నుంచి గ్రామాల్లోకి వెళ్లిన తర్వాత ఏది నిజం? ఏది అబద్దం ? ఒక చర్చ చేయండి.. తదుపరి ఓటు వేయండి, ఇప్పుడే మనం వివేచనా చేసే సమయం. ఒక్క ఓటుతో మట్టి తలరాత మారిపోతది. ఓటు వేసే ముందు గోసపడ్డ తెలంగాణ తల్లి ముఖాన్ని తలుచుకోవాలి.పాక్షికమైన సంతోషంకోసం ఈ మట్టికిచ్చిన మాటను మరువొద్దు. తెలంగాణ పార్టీని గెలిపించుకోవాలి.

బీఆర్‌ఎస్‌ ‌ది అన్ని కోణాల్లో పై చేయిగానే ఉంది.టికెట్ల పంపిణీలో, సంక్షేమ పథకాల ఊరూరా ప్రచారంలో ముందంజలోనే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వచ్చే వరకు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌, ‌బీజేపీ అభ్యర్థులను ఫైనల్‌ ‌చేయలేని దుస్థితి. విపక్షాలతో పోల్చుకుంటే 10 రేట్లు దూసుకుపోతుంది. జూన్‌ 2, ‌దశాబ్ది ఉత్సవాల నాటి నుంచి ఎన్నికలకు సిద్ధం అయ్యిందనే భావించాలి. అందులో భాగంగా ఆగస్టులోనే ఒకేసారి 115సీట్లు ప్రకటించి ఆగంపట్టించారు.కాంగ్రెస్‌ ‌పార్టీ బీఆర్‌ఎస్‌ ‌కు గట్టి పోటీ ఇవ్వాలనే వీరావేశం ఉన్నప్పటికీ గాడిన పడడానికి నానాతంటాలు పడుతున్నది. విపక్షాలు రేణి కంపలను నడిచే తొవ్వలో పడేసి అభివృద్ధి రథాన్ని అడ్డుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారు.కర్ణాటక ఎన్నికల ఫలితాల నుంచి విషనాగుల్లా బుసకొడుతున్నారు. సర్వేల పేరుతో మైండ్‌ ‌గేమ్స్ ఆడటమనే వికృత ధోరణి ఇటీవల పెరిగిపోయింది. మరో వైపు భాదకృష్ణ మీడియా ప్రజలను తప్పుదారి పట్టించే పనిలో నిమగ్నం అయ్యింది. మూడవసారి కేసీఆర్‌ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్‌ ‌వ్యతిరేకులు తెల్లారితే చేసే అబద్దాలు,అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 2018లో కూడా ఈ సర్వేలు భూమిపుత్ర పార్టీ గెలుస్తుందని ఎక్కడ చెప్పలేదు.అయినా..కేసీఆర్‌ ‌వెనుదిరుగలేదు. బ్యాలట్‌ ‌పెట్టెలు విప్పిన తర్వాత కానీ సన్యాసులకు విజయదుందుభి మోగించింది అర్థం కాలేదు. తెలంగాణ ప్రజల విజ్ఞత శంకించవీలులేనిదని మరోమారు ఋజువయ్యింది.

తెలంగాణ రాష్ట్ర సాకారం చేసిన ఉద్యమనేత కేసీఆర్‌ ‌నాయకత్వానికి అధికారం ఇవ్వాలని 2014లో అధికారం కట్టబెడితే 2018 ఎన్నికల్లో వారి పరిపాలనను చూసి అఖండ మెజార్టీ అందించారు.ఏ పాలకుడికైనా నూరుశాతం న్యాయం చేయడం సాధ్యం కాదు.ఒకతండ్రికి జన్మించిన సంతానానికి విభిన్న ఆలోచనలు ఉంటాయి. అటువంటిది అభివృద్ధికి బాటలు వేస్తున్న క్రమంలో 10నుంచి 20 శాతం మందికి నచ్చకపోయినా 80శాతం మందిని సంతృప్తి  పరిచినమా? లేదా అనేది ప్రామాణికం కావాలనే ఉద్ద్యేశంతో తెలంగాణ ప్రధాత బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.రైతు రాజ్యం నిర్మించి తెలంగాణ మోడల్‌ ‌దేశమంతా విస్తరించాలని నడుంబిగించారు. అటువంటి స్థితిలో నెల రోజుల్లో జరిగే  ఎన్నికల్లో చింతమడక బిడ్డ గెలువాలని అన్నదాతలు, మహిళలు, యువత ఆలోచనలో పడ్డది. తెలంగాణ సమస్యలు అవగతం చేసుకున్నా ఉద్యమనేత సీఎంగా కేసీఆర్‌ ఉం‌డడం వల్లనే ఆకలి చావులు లేవు, వలసలు లేవు అనేది బలంగా నమ్ముతున్నారు 66 ఏండ్లు పరిపాలించిన పార్టీలతో మనగోస తీరలేదు.ఈ నేలకన్నా భుమిపుత్రుడితో ఎక్కువ లాభం పొందినామనే స్వభావం అందరిలో దాపురించింది. ఆ ధైర్యంతో కేసీఆర్‌ అచ్చంపేట సభలో మాట్లాడింది కూడా అదే. అలాంటిది విపక్షాలు అర్థం చేసుకోకుండా కేసీఆర్‌ ‌పై విమర్శలకు దిగడం చూస్తూంటే ఆయా పార్టీల మానసికస్థితి ఏ విధంగా ఉందో పసిగట్టవచ్చు. రాజకీయ నాయకుల మిడిసిపాటు, వారు వాడే భాషను బట్టే వారికీ పరిస్థితులు సవ్యంగా లేవని జనానికి అర్థం అవుతుంది. నిష్పక్షపాతంగా ఆలోచించినట్లయితే నిజం ఏమిటో గుర్తించడం ఏమి కష్టం కాదు.60 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరాన్నభుక్కుల చేతబడకుండా ప్రజలు కాపాడుకుంటారనే ప్రబల విశ్వాసం ఉంది.

image.png

డా. సంగనిమల్లేశ్వర్‌
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,

‌సెల్‌ : 9866255355.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *