భారీగా డ్రగ్స్‌ పట్టివేత

రూ.9 కోట్ల విలువచేసే 90 కిలోల డ్రగ్స్‌ పట్టివేత
బొల్లారం పారిశ్రామిక వాడలోని పిఎస్‌ఎన్‌
మెడికేర్‌ పరిశ్రమలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల సోదాలు
గత పదియేళ్లుగా పరిశ్రమలో అక్రమ దందా

పటాన్‌చెరు,ప్రజాతంత్ర,మార్చి 22: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్‌ ను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్‌ ను స్వాధీనం పరుచుకున్నట్టు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడిరచారు. ఇంటర్‌ పోల్‌ సహాయంతో ఓ కంపెనీ లో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపీడ్రిన్‌ డ్రగ్స్‌ ని అధికారులు స్వాధీన పరుచుకున్నారు.image.png దీని విలువ మార్కెట్లో 9 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్‌ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో పరిశ్రమ నిర్వాహకురాలు కస్తూరి రెడ్డిని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు అరెస్టు చేశారు. సిగరెట్‌ ప్యాకెట్లలో డ్రగ్స్‌ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు తేల్చారు. అదేవిధంగా నగరంలో కూడా డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడిరచారు. కాగా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులతో బొల్లారం పారిశ్రామికవాడ దద్దరిల్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *