బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

అరెస్ట్‌ను ఖండిరచిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌..బిఎస్పీకి రాజీనామా
ప్రవీణ్‌ వ్యాఖ్యలపై సోషల్‌ విూడియాలో విమర్శలు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి16: బిఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూతురు, బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్‌  అని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.  దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. కెసిఆర్‌ తెలంగాణలో బిజెపి కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి`కాంగ్రెస్‌ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్‌ పాలిటిక్స్‌ కు తెర తీశాడని ఆయన ఆరోపించారు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదన్నారు. ఇలాంటి అక్రమ అరెస్ట్‌ ల తో అదిరేది బెదిరేది లేదని హెచ్చరించారు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఈ దుశ్చర్య కేంద్ర` రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి

బిఎస్పీకి రాజీనామా చేసిన అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌
 బహుజన్‌ సమాజ్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్‌ విూడియా వేదికగా వెల్లడిరచారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు.  భారాస`బీఎస్పీ పొత్తు ఒప్పందంలో భాగంగా ఆయన నాగర్‌ కర్నూలు నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే అనూహ్యంగా బిఎస్పీని వీడడం సంచలనం కలిగించింది. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే భాజపా దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను.

చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా అని ప్రవీణ్‌ కుమార్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. తెలంగాణలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన తరువాత ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. భారాస అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించే అవకాశముంది.బీఆర్‌ఎస్‌`బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌గా  ప్రవీణకుమార్‌ ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి స్వయంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్‌ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్‌ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *