బొమ్మై క్యాంపు కార్యాలయంలో పాము ప్రత్యక్షం

బెంగళూరు,మే13 : ఓ పక్క కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ప్రాంగణం వద్దకు రాగానే ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పాము అందర్నీ ఆందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ ‌డియాలోనూ హల్‌ ‌చల్‌ ‌చేస్తోంది. ఈ వీడియోలో ఓ పాము ప్రహారీ వెలుపల ఉన్న గార్డెన్‌లోకి పాకుతూ వెళ్లిపోతుంది.

ఆ తరువాత పామును సంరక్షించి, భద్రపరిచారు. కర్ణాటకలో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు వేగవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి యాసిర్‌ అహ్మద్‌ ‌ఖాన్‌ ‌పఠాన్‌, ‌కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై మధ్య అత్యంత గట్టి పోటీ ఉన్నందున షిగ్గావ్‌ ‌నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ ‌లో కాంగ్రెస్‌ 111 ‌స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 73 చోట్ల, జేడీఎస్‌ 30 ‌సీట్లలో లీడ్‌ ‌లో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *