బెట్టింగ్‌, ‌సామాజిక మాధ్యమాలకు బానిసలుగా యువత

నేడు యువత సామాజిక మాధ్యమాల బారిన పడి విలువయిన తమ భవిష్యత్‌ని సర్వ నాశనం చేసుకుంటూ వున్నారు. కొంత మందికి క్రికెట్‌ అం‌టే పిచ్చి. స్నేహితులతో కలిసి ఐపీఎల్‌లో ప్రతి క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌తిలకించిన తర్వాత సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌యాప్‌లోకి ప్రవేశించి పందాలు కట్టడం ప్రారంభించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తూ వున్నాయి. ఆరంభంలో నగదు రావడంతో మరింత ఉత్సాహం చూపిస్తారు. తరువాత పందాల్లో రూ.వేల నగదు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తొలుత బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేయడం, నగదు కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకున్న తర్వాత బకాయిలు పెరిగిపోవడంతో చోరీలకు దిగి పోలీసులకు చిక్కిపోతూ వున్నారు. ఆధునిక టెక్నాలజీలో అరచేతిలో ఇమిడే సెల్‌ఫోన్‌తో సమస్త ప్రపంచాన్ని వీక్షించే అవకాశం వచ్చింది. తాము చదివే కోర్సులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, జ్ఞానాన్ని విస్త్రతం చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం సామాజిక మాద్యమాలు, క్రికెట్‌ ‌బెట్టింగ్‌లు, ఓటీటీల్లో సినిమాల వీక్షణతో కాలక్షేపం చేస్తూ తమ జీవితాన్ని బలిచేసుకుంటున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ ‌విద్యార్థులు సెల్‌ ‌ఫోన్‌లను ఎక్కువగా వాడతారు. తల్లిదండ్రులు కొని ఇస్తే అప్పటి నుంచి వానిని రోజూ రాత్రి ఫోన్లో ఓటీటీ ప్లాట్‌ఫాం, యాప్‌లలో వీడియోలు చూడటం ప్రారంభించడము, నిద్రపోకుండా తెల్లవారుజామున రెండు, మూడు గంటల వరకు సెల్‌ఫోన్‌ ‌చూస్తూ గడిపేస్తున్నారు.

రాత్రి నిద్రపోకపోవడం వల్ల ఉదయం తరగతి గదిలో మత్తుగా ఉండి అధ్యాపకులు చెప్పే పాఠాలు వారికి అర్థం కావడం లేదు. ఏకాగ్రత దెబ్బతిని చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కరోనా లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇంట్లోనే ఉండాల్సి రావడం, ఖాళీ సమయం ఎక్కువగా లభించడంతో యువత ఓటీటీలు, యాప్‌లు చూడటానికి అలవాటుపడ్డారు. ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌ ‌సిరీస్‌ల్లో అశ్లీల సన్నివేశాలు, సంభాషణలు నేరుగా ప్రసారమవుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి సెన్సార్‌షిఫ్‌ ‌లేకపోవడంతో వీటిని చూసి పిల్లలు, యువత పాడైపోతున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హింసాత్మక, లైంగిక కార్యకలాపాల దృశ్యాలు నేరుగా ప్రసారం అవుతు ండటంతో యువత తీవ్రంగా ప్రభావితమై చెడిపోతున్నారు. విద్యార్థులు ఏకాగ్రత దెబ్బతిని సరిగా చదువుపై దృష్టిసారిం చలేకపోతున్నారు. తలనొప్పి, కంటిచూపు ఇతర అనారోగ్య సమస్యలు చుట్టు ముడు తున్నాయి. యాంత్రిక జీవనంలో సంస్కృతి, సంప్రదాయాలు మరిచి పోతున్నారు. నైతిక విలువలు, ప్రమాణాలు దిగజారిపోయి అడ్డదారులు తొక్కుతున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దందాలోకి దిగినట్లు పోలీసుల విచారణలో తేలుతుంది. ఎనిమిది నుంచి పది గంటలు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లలో సినిమాలు, వీడియోలు చూడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

పిల్లలు, యువతలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తలనొప్పి, కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. మత్తుపదార్థాల సేవనానికి అలవాటుపడి బానిసలై నగదు కోసం నేరాలకు దిగడం చాలా ఆందోళనకరం.ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌లు వచ్చిన తర్వాత పోలీసులు నిఘా పెట్టి పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఐపీఎల్‌ ‌సమయంలో పెద్దఎత్తున బెట్టింగ్‌లలో యువత భారీ ఎత్తున నగదు పోగొట్టుకున్నారు. రూ.లక్షల అప్పు చేసి తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగుల్చుతున్నారు.సెల్‌ఫోన్‌ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్ఛు విద్యార్థులు, యువత పలు రకాల ఆటలు ఆడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి ఇష్టమైన కళలో శిక్షణ ఇప్పిస్తే రాణిస్తారు. యోగ, ధ్యానం సాధన చేయించడం ద్వారా ఏకాగ్రత సాధిస్తారు. పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టి దారితప్పక ముందే వారు సన్మార్గంలో నడిచేలా చూడాలి. తల్లిదండ్రులు ఎంత తీరిక లేకుండా ఉన్నా పిల్లలకు మాత్రం తగిన సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మాట్లాడి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. మంచి, చెడు గురించి వివరంగా చెప్పాలి. సానుకూల దృక్పథంలో ఆలోచించేలా వుండాలి.. విద్యార్థులు, యువత బలహీనతలను ఆసరాగా తీసుకొని బెట్టింగ్‌ ‌తరహా వ్యాపారాలు కొంతమంది చేస్తున్నారని సామాజికవేత్తలు అబిప్రాయము వెలి బుచ్చుతూ వున్నారు. తొమ్మిది గంటల కల్లా పిల్లలని నిద్రపుచ్చి తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్ర లేపి ధ్యానం, యోగా సాధన చేయించాలి.
-కామిడి సతీష్‌ ‌రెడ్డి జడలపేట జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా 9848445134.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *