బిజెపి నేతల రెచ్చగొట్టే వాఖ్యలపై మౌనమేల

ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్‌ ‌వేదికగా కేటీఆర్‌ ‌నిలదీసారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ‌తన ట్వీట్‌కు జతపరిచారు.

బీజేపీ ఎంపీ వర్మ హిందూ సభలో మాట్లాడుతూ.. ఓ వర్గాన్ని పూర్తిగా నిషేధించాలని వ్యాఖ్యానిస్తారు. మరో ఎంపీ ప్రాగ్యా టాకూర్‌ ‌మాట్లాడుతూ.. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా వర్ణిస్తారు. ఇంకో ఎంపీ బండి సంజయ్‌ ఏమో.. మసీదులను తవ్వి చూడండి..అందులో శివలింగాలు బయటపడితే వాటిని ముస్లింలకు అప్పంగించడి అని కామెంట్‌ ‌చేస్తారు.

బిల్కిస్‌ ‌బానో రేపిస్టులు సంస్కారులు అని కొందరు పేర్కొంటున్నారని కేటీఆర్‌ ‌తన్‌ ‌ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు ఆమోద యోగ్యంగా ఉందా? అని కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా ప్రశ్నించారు. బీజేపీ ఎంపీల ప్రకటనలపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. మోదీకి చెవులు ఉన్నప్పటికీ, చెవిటి వాడిలా మౌనంగా ఉండటం దారుణమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *