బిజెపి కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆం‌దోళన

అగ్నిపథ్‌ ‌రద్దుచేయాలంటూ ధర్నా
ఇరు పార్టీల కార్యకర్తల బాహాబాహీ
ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు ధర్నా చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసమయ్యాయి. కొన్ని గంటల పాటు ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పీఎస్‌ ‌కు తరలించారు. దాడి చేస్తారని ముందే సమాచారం ఉన్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయనే సంగతి తెలిసిందే. 347 మంది జాతీయ నేతలు హైదరాబాద్‌ ‌కు క్యూ కట్టారు.

ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేశారు. ఈ క్రమంలో.. హనుమకొండలోని బీజేపీ కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జాతీయ నేతతో పాటు స్థానిక పాల్గొన్నారు. ఈ సమయంలో..అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ.. కాంగ్రెస్‌ ‌నేతలు బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం కలకలం రేపింది. కార్యాలయంపై దాడి చేస్తారనే సమాచారంతో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు.

నేతల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాడుల్లో సుబేధారి సీఐ గన్‌మన్‌కు గాయాల య్యాయి. సమావేశం భగ్నం చేసేందుకు కాంగ్రెస్‌ ‌నేతలు ప్రయత్నించారని బీజేపీ నేతలు దుయ్యబట్టారు. బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ‌ధర్నా చేస్తదని సోషల్‌ ‌వి•డియాలో ప్రచారం జరిగినా పోలీసులు ఎందుకు స్పందించలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *