జడ్చర్ల, ప్రజాతంత్ర, జూలై 25 : బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల వి•డియాతో మాట్లాడుతూ.. అనేక మంది టీఆర్‌ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్‌తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.




