అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపిలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడిరచాం
ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే బిఆర్‌ఎస్‌ను బద్నామ్ చేస్తున్నారు
రాహుల్ జోడో అంటుంటే..నేతలు ఛోడో అంటున్నారు
బిజెపిని నిలువరించాడం ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : బిజెపిని ఓడిరచే సత్తా కేవలం బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి రామారావు అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపిలను, ఇద్దరు ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రమే ఓడిరచారని అన్నారు. వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడిరచాలంటే బిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీకి బిజెపిని ఓడిరచే సత్తా లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకున్నారని..కానీ హైదరాబాద్ బయట స్వల్ప వోట్ల తేడాతో సీట్లు తగ్గాయని..14 సీట్లలో స్వల్ప తేడాతో కోల్పోయామని కేటీఆర్ అన్నారు. శనివారం యూసుఫ్‌గూడాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ విూటింగ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక హావిూలు నెరవేర్చలేక బీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గొంతు పిసుకుతా అని రేవంత్ మాట్లాడారని..హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ గొంతు పిసుకుతారా అని ప్రశ్నించారు. ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటుంటే..ఆయన పార్టనర్స్ అంతా రాహుల్ చోడో అంటున్నారని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్ అందరూ కాంగ్రెస్‌ను వొదిలేస్తున్నారన్నారు. బీజేపీని ఎదుర్కునే సత్తా కాంగ్రెస్‌కు లేదని, కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజీవ్రాల్ లాంటి నాయకులకే ఉందన్నారు. మహాలక్ష్మీ పథకం పెట్టి మహిళల మధ్య గొడవలు పెట్టారన్నారు. ఫ్రీ బస్సు మంచిదే కానీ బస్సుల సంఖ్య పెంచాలని ఆయన హితవు పలికారు.
ఆటో డ్రైవర్ల పొట్ట కూడా కొట్టారన్నారు. ఒక పథకం పెట్టినపుడు సరైన ప్రణాళిక ఉండాలని సూచించారు. రాష్టంలో కోటి 57 లక్షల మంది మహిళలకు రూ.2500 ప్రతినెలా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే కాంగ్రెస్ భయంలో ఉంటదన్నారు. కిషన్‌రెడ్డి అంబర్ పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయి సానుభూతితో ఎంపీగా గెలిచారన్నారు. ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక ఒక్క బస్తీకైనా ఎమన్నా మంచి పని చేశారా అని నిలదీశారు. దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేయడం తప్ప కిషన్ రెడ్డి చేసింది ఏముందని ప్రశ్నించారు. మోడీ ప్రియాయమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అని జనాలు అంటున్నారన్నారు. భారత్ మొత్తంలో అట్టర్ ప్లాఫ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటూ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీవి ఫెవికాల్ బంధమని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని.. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుపైకి తీసుకువచ్చిందని విమర్శించారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం తెలంగాణ భవన్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచామన్నారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప వోట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హావిూని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు బంగారు ప్లళెంలో తెలంగాణను పెట్టి ఇచ్చామన్నారు. ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీకి బయటకు వెళ్లిపోతుందన్నారు. బీజేపీని ఓడిరచాలంటే కాంగ్రెస్ సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ను భరించాలంటే తమ వల్ల కాదని నితీశ్‌కుమార్ అంటున్నారన్నారు.
కూటమికి నితీశ్ కుమార్ కూడా బైబై చెప్పారని, బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ బొండిగ పిసికేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని బండి సంజయ్ అంటున్నాడని, రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసినందుకా, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారని, ఉచిత బస్సు పథకం రచ్చరచ్చ అయ్యిందన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోయారన్నారు. బిల్డప్ కోసం పథకాలు తెస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. రాష్ట్రంలో 51శాతంపైగా మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. తాము ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పంపితే తిరస్కరించిన గవర్నర్, కాంగ్రెస్ పంపగానే ఆమోదించిందన్నారు. రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను కలువగానే రెండు ఎమ్మెల్సీలను ఖరారు చేశారని ఆరోపించారు. కిషన్‌రెడ్డికి మరోసారి వోటు అడిగే హక్కులేదన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతే ప్రజలు బాధపడి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారని, కేంద్రమంత్రిగా ఒక్క పని చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రూపాయి నిధులు కూడా కిషన్ రెడ్డి కేటాయించలేదని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండి ఎందుకు దండగ అన్నారు. కాంగ్రెస్ అలవిగాని హావిూలు ఇచ్చి అధికారంలోకి వొచ్చిందన్నారు. మోదీ పాలనలో ధరల పెరుగుదల తప్ప మరేవిూ లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్న కేటీఆర్. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. హావిూలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలకు కోపమొస్తుందని..ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సరైన సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని గెలిపించాల్సిన ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు.





