ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కెసిఆర్ వస్తుండంతో బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసారని..ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి మంగళ వారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రత్రికా ప్రకటన లో పేర్కొన్నారు. నాగార్జునసాగర్ బై ఎలక్షన్ లో ప్రచారం నిమిత్తం కేసీఆర్ వచ్చినప్పుడు నెల్లికల్ లిఫ్టుని కుర్చీ వేసుకొని కట్టిస్తా అన్న వాగ్దానం ఇప్పటికి నెరవేరలేదు అని పేర్కొంటూ..రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు.. అసహనంతో బిజెపి కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు..సంఘ విద్రోహశక్తులకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ.. బీ ఆర్ ఎస్ గుండాల దాడులకు భయపడదు..వైఫల్యాలతో ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడుతుంటే, వారి సమస్యలను పరిష్కరించకుండా, బిజెపిని ఎదుర్కునే దమ్ము లేక బిజెపిపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటు..ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అధికార పీఠం కదులుతున్నదని భౌతిక దాడులకు దిగుతున్నారు.. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో బిజెపిని నేరుగా ఎదుర్కోవాలి. కాని ఇటువంటి దాడులు చేయడం పిరికిపంద చర్యకు నిదర్శనం..సీఎం డైరెక్షన్ లోనే ఈ దాడుల జరుగుతున్నాయనే అనుమానాలుబ లపడుతున్నాయి..భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ గుండాల దాడులు, దౌర్జన్యాలకు భయపడదు.. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అపూర్వ మద్దతు, ఆశీర్వదంతో రాష్ట్రంలో గెలిచేది బిజెపి అనేది నిజం..అని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.




