‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన ఉపా కేసులు నమోదు..

సర్కార్‌ ‌పాశవిక చర్య ..!
వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌
‌హైదరాబాద్‌•, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య…అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తుంది..ప్రొ. హరగోపాల్‌ ‌తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి..అని పేర్కొన్నారు. ఆయన పౌర హక్కుల కోసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజా హక్కులను కాపాడిన మానవతా వాది..సెంట్రల్‌ ‌యూనివర్సిటీలలో పౌర హక్కుల కోసం పాఠాలు బోధించిన ప్రొఫెసర్‌..‌తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేసిన ఉద్యమ కారుడు..

నక్సలైట్‌ ఎజెండానే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్‌, ‌హరగోపాల్‌ ‌నక్సలైట్‌కు సహకరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం ఒక అప్రజాస్వామిక చర్య..అని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో హరగోపాల్‌ ‌దోషి అయితే నక్సలైట్ల ఏజండానే మా ఏజండా అన్న కేసీఆర్‌ ‌కూడా దోషినే కదా..నక్సలైట్ల ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్‌పైన కూడా కేసులు పెడతారా అని ప్రశ్నిస్తూ..హరగోపాల్‌తో పాటు 152 మంది పైన కేసులు ఎత్తేయాలని డిమాండ్‌ ‌చేసారు. తెలంగాణ పౌర, ప్రజాస్వామిక సంఘాలు రాజకీయ పక్షాలు హరగోపాల్‌కు అండగా ఉండాలి..హరగోపాల్‌తో పాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తెయ్యలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తుంది..ప్రజాస్వామిక పౌర సంఘాలు బిఆర్‌ఎస్‌, ‌బిజేపీలకు వ్యతిరేకంగా ప్రజల కోసం గళం విప్పుతుంటే ప్రభుత్వాలు ఇలా పాశవికంగా ప్రవర్తిస్తున్నాయి..కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే హరగోపాల్‌తో పాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేస్తాం..అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *