- సెల్‌ఫోన్‌తో హాజరైన అభ్యర్థి పట్టివేత
- బలగం సినిమాపై పరీక్షలో ప్రశ్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే పరీక్ష సందర్భంగా ఓ అభ్యర్థి సెల్ ఫోన్‌తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్‌తో హాజరైనట్లు ఇన్విజిలేటర్ గమనించారు. అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరీష్ ప్రకటించారు. ఆ అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించా రు. ఈ సంఘటన మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు ప్రకటించారు.
టీఎస్‌పీఎస్‌ఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల్లో పేపర్ల లీకేజీ జరగడంతో ఇటవల ఏ చిన్న అంశం జరిగినా సంచలనం అవుతుంది. అందుకే ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు పకడ్మందీ చర్యలు తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీని అందిప్చుచుకుని హైటెక్ పద్దతిలో కాపీయింగ్ చేస్తున్న వారిని ఇటీవల పట్టుకుంటున్నారు. అందుకే ఏ చిన్న ఎలక్ట్రానిక్ పరికారన్ని కూడా అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించ లేదు. అలా తీసుకెళ్లినట్లుగా గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా సెల్‌ఫోన్‌తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థి తెలియక తీసుకెళ్లారా లేకపోతే.. ఉద్దేశపూర్వకంగా తసుకెళ్లారా అన్నది తేలాల్సి ఉంది.
ఇక అత్యధిక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ సారి భారీ స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ కఠిన నియమాలు అమలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాలు ముందే గేట్లు మూసివేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులను అనుమతించలేదు. ఇకపోతే ఉదయం సెషన్‌లో జరిగిన పరీక్షలో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇవ్వడం సోషల్ వి•డియాలో చర్చనీయాంశమయింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండటంతో ఈ సినిమాపై కూడా ప్రశ్నను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు 9.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైనట్లుగా తెలుస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మినహా అంతా ప్రశాంతంగానే జరిగినట్లుగా తెలుస్తుంది



