‘‘జలియన్ వాలా బాగ్ మారణ కాండలో ప్రాణాలతో బయటపడిన యువకుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, పగ తీర్చకోవడానికి ఏళ్ళ తరబడి నిరీక్షించి, లక్ష్య సాధనలో దేశాన్ని వదిలి, విదేశానికి శ్రమకోర్చి వెళ్ళి, సమయం కోసం వేచి ఉండి, నర రూప రాక్షసుడైన డయ్యర్ ను హత మార్చి, ఉరి తాడును ముద్దాడిన దేశం గర్వించదగ్గ అమరుడు ఉద్దమ్ సింగ్ సాహసోపేత నేపద్యం అనన్య సామాన్యం, అపూర్వం, అసమానం. ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసు కోవాలంటే వంద ఏళ్లు వెనకకు వెళ్లాల్సిందే.’’
నేడు ఉద్ధం సింగ్ బలిదాన దినం
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వారెం దరో…అయితే అమర వీరుడు ఉద్దం సింగ్ ఆత్మార్పణం ఒక ప్రత్యేకం. కళ్ళముందే అగణిత ప్రాణాలను కిరాతకంగా తుపాకీ గుళ్ళకు బలి చేసిన శ్వేత జాతి అధికారిని హతమార్చి పగ తీర్చుకున్న సందర్భం. దేశ చరిత్రలో చెరిగి పోలేని దేశభక్తికి పరాకాష్టగా నిలిచిన ముఖ్య ఘట్టం. జలియన్ వాలా బాగ్ మారణ కాండలో ప్రాణాలతో బయటపడిన యువకుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, పగ తీర్చకోవడానికి ఏళ్ళ తరబడి నిరీక్షించి, లక్ష్య సాధనలో దేశాన్ని వదిలి, విదేశానికి శ్రమకోర్చి వెళ్ళి, సమయం కోసం వేచి ఉండి, నర రూప రాక్షసుడైన డయ్యర్ ను హత మార్చి, ఉరి తాడును ముద్దాడిన దేశం గర్వించదగ్గ అమరుడు ఉద్దమ్ సింగ్ సాహసోపేత నేపద్యం అనన్య సామాన్యం, అపూర్వం, అసమానం. ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసు కోవాలంటే వంద ఏళ్లు వెనకకు వెళ్లాల్సిందే. పంజాబ్, బెంగాల్ లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం, భారత ప్రజల్లో నానాటికీ రగులు తున్న అసంతృప్తి (ముఖ్యంగా బాంబే మిల్ వర్కర్స్ లో), మొద లైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తి యైన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు.
రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భార తీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్ లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. ప్రెస్ నోళ్ళను కట్టేయడానికీ, విచా రణ లేకుండా రాజకీయ నాయ కులను నిర్బంధించడం, తిరుగు బాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరం కుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్త మయ్యాయి. జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లోగల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ తోటలో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశ మైనారు. అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశ మవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం, అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధిం చడాన్ని వ్యతిరేకించడం. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైని కులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయు ధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. ఇరుకైన సందుల కారణంగా వాహ నాలు బాగ్ లోపలికి రాలేక పోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి.
కాల్పుల కారణంగా వందలమంది మరణించారు. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణిం చారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు. పంజాబ్ అమృత్ సర్ లోని 1919 ఏప్రిల్ 13 న జలియన్ వాలా భాగ్ లో శాంతియుతంగా వేల మంది సామాన్య పౌరులు సమావేశం అయి ఉండగా పోలీసులతో చుట్టు ముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేల మంది మరణానికి కారణం అయ్యాడు జనరల్ డైయర్. షేర్ సింగ్ (ఉధం సింగ్) 1899 డిసెంబర్ 26 న పంజాబ్ లో సంగ్రూర్ జిల్లా సునం అనే గ్రామం లో కాంబోజి సిక్ కుటుంబంలో జన్మించారు. తండ్రి తెహల్ సింగ్ పొరుగు గ్రామమైన ఉపాల్ లో జమ్ము రైల్వే క్రాసింగ్ కాపలా దారుగా జీవనం సాగించేవారు. ఉదం సింగ్ తల్లి 1901లో తండ్రి 1లో చనిపొయారు. షేర్ సింగ్ (ఉధం సింగ్ ) వారి తల్లి తండ్రులు చనిపోయాక అన్న ముక్తా సింగ్ తో కలిసి అమృత్ సర్ లో సెంట్రల్ ఖల్సా అనాథ ఆశ్రమంలో చేరారు. అక్కడ సిక్కులకి మతపరమైన దీక్ష చేసి అక్కడ వారి చేత ఉదం సింగ్ అనే పేరుని స్వీకరించారు.
మెట్రిక్యు లేషన్ చదువు 1918లో పూర్తి చేసి 1919లో ఆ అనాథ ఆశ్రమం నుండి బయటకి వచ్చాడు. జలియాన్ వాలా బాగ్ సంఘటనలో యువకు డైన సింగ్ కూడా ఉన్నాడు. అమా నుష దాడి తన కళ్ళ ముందే జరగడంతో హత్యాకాండకు సూత్రధారి అయిన డైయర్ను, జెనరల్ మైకెల్ ఓ డయ్యర్ను హతమార్చడానికి ప్రతీకారాన్ని ప్రతిన బూనాడు. భగత్ సింగ్ విప్లవ భావాలకి ఆకర్షితుడై 1927 న భగత్ సింగ్ ఆదేశాల మేరకు విదేశాలనిండి తుపాకులు తెస్తు పొలీసులకు దొరికి 1931 వరకు జైలు జీవితం గడిపాడు. విప్లవ వీరుడు భగత్ సింగ్ ను ఉరి తీయడం సింగ్ ను కలచి వేసింది. జైలు నుండి విడుదల అయిన తరువాత చదువు పేరుతో పేరు మార్చుకుని, పోలీసుల నిఘా నుండి తప్పించు కుని కాశ్మీర్, జర్మనీ మీదగా లండన్ చేరాడు. డైయ్యర్ ని హత్య చేయడానికి పగబట్టి 9 సంవత్స రాలు ఎదురు చూసి 21 సంవత్స రాల తరువాత మార్చ్ 1940 మార్చి 13 న లండన్ కాక్స్ టన్ హాల్ లో డయర్ ని అందరు చూస్తుండ గానే తుపాకీతో కాల్చి హత్య చేసి ప్రతీకారం తీర్చుకుని పోలీసులకి స్వచ్చందంగా పట్టుబడి తను చంపిన కారణాన్ని నిర్భ యంగా చెప్పాడు. దీంతో జూన్ 4, 1940 న, ఓల్డ్ బెయిలీలోని సెంట్రల్ క్రిమినల్ కోర్టులో, జస్టిస్ అట్కిన్సన్ మరణశిక్ష విధించాడు. జూలై 31, 1940 న, ఉధమ్ సింగ్ ను లండన్ లోని పెంటన్ విల్లే జైలులో ఉరి తీసారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494




