ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్ 2023 ఆవిష్కరణ

ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ  ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్…

ప్రజాతంత్ర దినపత్రిక 2023 క్యాలెండర్, డైరీ ని హనుమకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదివారం సర్క్యూటివ్ గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమం కాలంలో ప్రజలను ఎంతగానో ప్రేరేపించిందని, గడిచిన 25 సంవత్సరాల కాలంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రజాతంత్ర తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలపై నమ్మకంతో వార్తలు రాసేది అని ఆయన అన్నారు. పత్రిక రంగం, మీడియా రంగం రెండు కూడా సమాజానికి ఎంతగానో దోహదపడుతున్నాయని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం శ్రమిస్తున్నాయని ఆయన అన్నారు. పత్రికా రంగంలో వచ్చిన ఆధునిక అభివృద్ధి వార్తా ప్రసారాలకు సులభతరం అయిందని, ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగిన క్షణాలలో ప్రపంచవ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందించడానికి సామాజిక మాధ్యమాలు పత్రికలు ముందుంటాయని వినయ్భాస్కర్ అన్నారు. పత్రికల ద్వారా క్యాలెండర్ డైరీ ని ముద్రించి ప్రజలకు అందజేయడం ఒక మంచి పరిణామం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ( కూడా మాజీ చైర్మన్) మరి యాదవ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణ్ కుమార్, ప్రజాతంత్ర తెలంగాణ చీఫ్ బ్యూరో వంగ నారాయణరెడ్డి, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్ .బుచ్చిరెడ్డి, డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, వేణుమాధవ్, డాక్టర్ రాజన్న, రామ్మోహన్, వనం శ్రీకాంత్, ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *