‘‌ప్రజాతంత్ర’ అభినందనలు..!

అంగన్వాడీ వ్యవస్థపై మీరు ప్రజాతంత్ర పత్రికలో సోదాహణంగా వ్రాసిన సుదీర్ఘ వ్యాసం చదివాను. భవిష్యత్తు భారతాన్ని రూపొందించే ప్రాముఖ్యతను సంతరించుకున్న పథకం ఏ విధంగా లక్ష్యానికి దూరం చేయబడుతున్నదో, ఈ పథకంలో సేవలందిస్తున్న వారి శ్రమశక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నదో మానవీయ కోణంలో నిర్దిష్టంగా వివరించిన తీరు ప్రశంసనీయం.

దేశంలోని బాధ్యతగల ప్రతి పౌరుడు, సామాజిక సేవలో నున్న ప్రతి సంస్థ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పథక సక్రమ నిర్వహణపై, తద్వారా పథక నిర్దేశిత లక్ష్య సాధనకై బాధ్యత గల ప్రభుత్వాలపై, వ్యవస్థలపై వత్తిడి తీసుకుని రావలసిన అవసరం ఉంది. ఈ వ్యాసాన్ని ప్రచురించడం ద్వారా తమ కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు ‘ప్రజాతంత్ర’ పత్రిక యాజమాన్యానికి, వ్యాసకర్తకు అభినందనలు.
– ఉమామహేశ్వరరావు,
సీనియర్‌ ‌సిటిజన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *