- కొత్తగా 17.35 లక్షల మెట్రిక్ టన్నుల 457 గోడౌన్ల నిర్మాణం
- 58 వ్యవసాయ మార్కెట్లలో ఈ నామ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను పటిష్టపరచడానికి పలు చర్యలు తీసుకుంటున్నది. తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశ్యం. సరైన గిట్టు బాటు ధరలు లభించేలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 7.50 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ సామర్థ్యం గల 750 గోడౌన్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర అవసరాలకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించడానికి గోడౌన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాబార్డ్ సహకారంతో రూ 10.24 కోట్ల వ్యయంతో 364 ప్రాంతాలలో 17.35 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 457 గోడౌన్ల నిర్మాణాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు 347 ప్రాంతాలలో గోడౌన్ల నిర్మాణం పూర్తయింది. దీనితో మార్కెటింగ్ శాఖకు సంబంధించి గోడౌన్స్ స్టోరేజ్ సామర్థ్యం 7.38 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 24.65 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఈ గోడౌన్స్‌ను పిడిఎస్ బియ్యం, ఎరువులు, ఎంఎస్పి ఆపరేషన్లు, రైతు బంధు పథ•కం కోసం ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2014-15 నాటికి, తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ , సివిల్ సప్లై కార్పొరేషన్, మార్క్ ఫైడ్ , సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ , ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇన్వెస్టర్ గోడౌన్స్, ప్రైవేట్ ఎంటర్ ప్రేన్యూర్ గ్యారెంటీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గోడౌన్స్, ప్రైవేట్ తదితర విభాగాలకు సంబంధించి 39.01 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు ఉండగా, 2021-22 నాటికి 73.80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా 58 వ్యవసాయ మార్కెట్లలో ఈ నామ్‌ను అమలు చేస్తున్నది. నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ 2017లో పిఎమ్ ఎక్సలేన్సీ అవార్డును పొందింది. 2019 ఏఏంసి కేసముద్రం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లు ఈ నామ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నందున దేశ వ్యాప్తంగా మొదటి స్థానం సాధించింది. ఈ నామ్ ద్వారా 16,977 కోట్ల విలువ గల 50.18 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. 18 లక్షల పైగా రైతులు, 5,832 ట్రేడర్లు,4,758 కమీషన్ ఏజెంట్లు రిజిస్టర్ చేసుకున్నారు. కరీంనగర్ హైవేపై కూరగాయలు విక్రయించే మహిళా రైతుల కోసం ప్రజ్ఞ్ఞాపూర్ అల్లంపూర్ల వద్ద రైతు మార్కెట్లను నిర్మించింది. వీటి ద్వారా ఎంతోమంది మహిళా రైతులకు, ప్రయాణికులకు ఉపయోగం కలిగింది. రూ.20 కోట్లతో సిద్దిపేటలో రూ 22.85 కోట్లతో గజ్వేల్ లో , రూ.19.85 కోట్లతో సూర్యపేటలో సమీకృత మార్కెట్లను నిర్మించింది.

వీటి ద్వారా రైతులకు, వినియోగదారులకు ఎంతో మేలు చేకూరింది. దేశంలోనే మొట్ట మొదటి సారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ల నియామకాలను ఎస్టి 6%, ఎస్సి 15%, బీసీ 29%, మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు పరుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో 30 రైతు బజార్లు ఉండగా, కొత్తగా 30 రైతు బజార్లను మంజూరు చేయడం జరిగింది. 47 రైతు బజార్లు పనిచేస్తున్నాయి.13 రైతు బజార్ల నిర్మాణం పురోగతిలో ఉంది. సిరిసిల్ల , కూకట్ పల్లిలో మోడల్ రైతు బజార్లను నిర్మించింది. బోయినపల్లి, ఎర్రగడ్డ లలో బయో గ్యాస్ ప్లాంట్లు వినియోగించడంతో పాటు గుడి మల్కాపూర్, బాట సింగారంలో నిర్మాణంలో ఉన్నాయి. బోయినపల్లిలో ప్రతిరోజూ 10 టన్నుల వ్యర్థాన్ని వినియోగించి బయోగ్యాస్, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. వినియోగదారులకు, రైతులకు సత్వర సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మార్కెటింగ్ శాఖ ఈ-లైసెన్స్, ఈ-పర్మిట్స్, ఈ-పేమెంట్స్, ఈ-రిసిప్ట్, లాంటి ఈ సేవలను కూడా ప్రారంభించింది.




