ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా…

పత్రికలు కావచ్చు..చానెళ్లు కావచ్చు..వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు.. ప్రజలకు కావాలసింది ఏమిటి..?  జరుగుతున్నది ఏమిటన్నది నిష్పక్షపాతంగా వెల్లడిరచాల్సిన మీడియా మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి..? మీడియా వాస్తవాలను చూపుతుందా..? వారు చెప్పేది వాస్తవ సమస్యలేనా..?  పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నారా..? లిఅంటే లేదనే చెప్పొచ్చు..అవాస్తవాలను, నిందనలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి.  ఎన్నికల సమయంలో ఇలాంటి జిమ్మిక్కులను ఎదుటి పక్షాన్ని జనంలో పలచన చేయడానికి రాజకీయ పార్టీలు ఎంతగానో ఉపయోగించుకున్నా.. తెలంగాణ  వోటర్లు అవేమీ పట్టించుకోకుండా తమ విస్పష్ట తీర్పు ద్వారా మార్పును కోరుకుంటున్నామని కుండ బద్దలు కొట్టి మరీ కాంగ్రెస్‌ కు అధికారం కట్టబెట్టారు..  కేవలం రాజకీయ పార్టీల అసత్య ప్రచారాలకు  సామాజిక మాధ్యమాలు వేదికగా మారాయనేది నిజం.. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీకి చెందిన  మీడియా పరిస్థితి మరీ దారుణం.. అధికారానికి వచ్చి నెలరోజులు పూర్తి కాలేదు..అప్పుడే కొత్త ప్రభుత్వంపై అసత్య  ప్రచారం ప్రారంభం కావడం శోచనీయం..మీడియా పరిస్థితి ఇలా ఉంటే..అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ మరీ దారుణంగా వ్యవహరిస్తోంది.

బంగారు తెలంగాణ చేస్తున్నామన్న పేరుతో తెలంగాణలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసారు. ఇది మనం అనుకునే మాట కాదు.. అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి గారి సారథ్యంలోని కొత్త ప్రభుత్వం శాఖల వారీ సమీక్షలు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి.బంగారు తెలంగాణ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ గత పదేండ్లలో  తెలంగాణ అభివృద్దిని పాతాళానికి తొక్కేశాడని  సమీక్షలతో తేట తెల్లమవుతోంది. ఏ ఒక్క మంత్రిత్వ శాఖ కూడా సరైన మార్గంలో ప్రయాణం సాగించిన దాఖలాలు, ప్రజలకు మంచి చేసిన నిర్ణయాలు కనిపించడం లేదు. పాలకుల విలాసవంతమైన జీవనం కోసం వందల కోట్లు ఖర్చు చేసిన లెక్కలే తప్ప  గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణలోని  ఏ ఒక్క వర్గం బాగుపడిన దాఖలాలు లేవు. అన్ని వర్గాలను మాయచేస్తూ ..అవాస్తవాలతో ప్రజలను మభ్య పెట్టిన  వాస్తవం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.  కేంద్రంతో కయ్యం.. తెలంగాణ ప్రజలకు దూరం.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను విచ్చిన్నం చేయడం.. పౌరహక్కులను కాపాడకపోవడం.. ముందస్తు శాంతి భద్రతల పేరుతో ప్రజల గొంతులు మూగపోయే విధంగా నిర్బంధించడం..  ప్రజా స్వామిక వాదులపై అక్రమ కేసులు పెట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే..  కేసీఆర్‌ పాలనలోని అప్రజాస్వామిక చర్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఇది గత పాలకుల నియంత పాలనకు నిదర్శనం..  కాంగ్రెస్‌ నేతృత్వంలో  కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం పలు సమస్యలతో సతమతవుతున్న ప్రజలు వేల సంఖ్యలో నగరానికి చేరుకుని ప్రజా భవన్‌ ముందు క్యూ కడుతున్న దృశ్యం ఆవేదన కలిగిస్తోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న గత కేసీఆర్‌  ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందనడానికి ప్రజల నుంచి కొత్త ప్రభుత్వానికి వెల్లువలా వస్తున్న ఆర్జీలే నిదర్శనం.గత బీఆర్‌ఎస్‌ పాలకుల నిర్లక్ష్యం.. విధ్వంసక పాలన కారణమన్న వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు  సామాజిక మాధ్యమాల ద్వారా  కొత్తగా కొలువైన ప్రభుత్వంపై అప్పుడే బురదజల్లేందుకు మీడియా సహా ప్రధాన ప్రతిపక్షం వెనుకాడడం లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. ప్రజలను కలవడానికి కూడా ఇష్ట పడలేదు. సమస్యలను పాతరేసే ప్రయత్నం చేశారు.  గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా ప్రధాన ప్రతిపక్షం గత వారం పది రోజులుగా ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది.

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను  అమలు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం  ప్రారంభించింది.ప్రజల తీర్పును గౌరవించే కనీస సంస్కారం కరువైంది.. అధికారం నుంచి ఎందుకు ప్రజలు తప్పించారో వాస్తవాలను జీర్ణించుకొనే శక్తి గత పాలకులకు కనిపించడం లేదు. ఇప్పటికీ   ప్రజల మన్నన మళ్లీ ఎలా పొందాలన్న కనీస  ఆలోచన అసలే లేదు.  కోల్పోయిన అధికారం దక్కించుకోవాలన్నట్లుగా, కొత్త ప్రభుత్వంపై బురద జల్లడమే ఎజెండాగా వ్యవహరించడం ప్రజాస్వామిక స్ఫూర్తిని మంటగలిపేలా అవాస్తవాలతో విరుచుకుపడడం  వారి అవివేకాన్ని తెలుపుతోంది.. ఇందుకు మీడియా కూడా వంత పాడేలా వ్యవహరించడం మరింత దారుణం..
దాదాపు పదేండ్లపాటు  ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్‌ ఎన్నికల ఫలితలు వెలువడి నెల రోజులు గడిచిపోతున్నా..  ప్రజల ముందుకు రాకపోవడం.. తెలంగాణ ప్రజలంటే ఎంత చులకనో తెలుపుతోంది..కొత్త ప్రభుత్వం డిసెంబర్‌ 6 న కొలువదీరింది.  లంకె బిందెలు ఉంటయనుకుంటేఖాలీ  బిందెలు దర్శనమిచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రకటించడం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తెలుపుతోంది.. గత పాలకుల ఇష్టారీతి  వ్యవహారాలు, నిరర్థక ప్రాజెక్టుల నిర్మాణం.. అంతులేని అవినీతితో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ కుదేలయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలనను గాడిలో పెట్టెందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు విరామం లేని కృషి సాగిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసింది.మిగిలిన హామీల అమలుకు  ప్రజా పాలన కార్యక్రమం ఊరూరా నిర్వహిస్తూ అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకుండానే ఏదో జరిగిపోయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం ప్రారంభించి ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రధాన ప్రతిపక్షం పకడ్బందీ ప్రచారానికి, మీడియా వంత పాడడం శోచనీయం..
ఇది వారి దివాలాకోరు తనానికి నిదర్శనం..తెలంగాణ ఏర్పాటు సమయంలో మిగులు రాష్ట్రంగా ఉంటే  పాలకులు అప్పులకుప్పగా మార్చారు. సాగునీటి రంగంలో చేసిన వ్యయం ఎలాంటి అనర్దాలకు దారి తీస్తుందో ఇప్పుడిప్పుడే ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారు.  మరో 40 ఏండ్లు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా సచివాలయాన్ని కూల్చడం.. వందల కోట్లతో కొత్తగా సచివాలయం నిర్మించడం.. ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం డాక్టర్‌ వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన భవానాన్ని కాదని ప్రగతి భవన్‌ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసారు.

కాళేశ్వరం పేరుతో.. మిషన్‌ భగీరథ.. కమీషన్ల కాకతీయ ఇలా చెబుతూ బంగారు తెలంగాణ చేస్తున్నామంటూ దాదాపు రూ.7లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిపై రుద్దారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెలువరించిన శ్వేతపత్రంతో వైఫల్యాలు బయటకు రావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారానికి తెర లేపింది ప్రధాన ప్రతిపక్షం.  లిప్రజలు ఆలోచించి సరైన సమయంలో సముచితమైన తీర్పు ఇస్తారు.పాలకులగా ఎవరుండాలో.. ప్రతిపక్షంగా ఎవరుంటే బాగుంటుంది అనేది ప్రజలకు బాగా తెలుసు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ అనేక అసత్య ప్రచారాలు చేసినా.. కాంగ్రెస్‌ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేసినా ప్రజలు నమ్మలేదు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాదు.. నన్ను చూసి వోటేయండి అని కేసీఆర్‌ కోరినా.. గెలిపిస్తే  ప్రభుత్వంలో ఉంటాం, లేదంటే ఇంటి బాట పడుతామని  బహిరంగ సభల్లో ప్రకటలను చేసినా..ప్రజలు బీఆర్‌ఎస్‌ ను అధికారం నుంచి దించారు. కేసీఆర్‌ ను ఇంటికి పంపారు. ప్రజల తీర్పును గౌరవించాలన్న సంస్కారం కూడా లేకుండా ..  విష ప్రచారనికి దిగిన బీఆర్‌ఎస్‌ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.  హామీల అమలు.. పాలనపై పట్టు కోసం  కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. అప్పటి వరకు వ్యతిరేక ప్రచారం ఎంత సాగించినా ప్రజలు పట్టించుకోరన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలా కాకుండా వ్యతిరేక ప్రచారం చేస్తే .. మీడియా సహా వారే ప్రజల్లో పలుచన కావడం ఖాయం..
-ప్రజాతంత్ర పాఠకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *