ప్రజలంటే….?

ప్రజలంటే తేలిక కాదు.
వోటు అంటే నోటు కాదు
ఓ ఆలోచనకు ఆగ్రహమోస్తే
ప్యాలెస్లు కూలుతాయి…

ప్రజలంటే చులకన కాదు
సిద్దం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు.
ఓ ఆచరణ మొదలైతే
ఓటమి బటన్‌ నొక్కుతారు

ప్రజలంటే  పలుచన కాదు
డబ్బుతో కొనుక్కునే పశువులు కారు
తమను తాము కాపాడుకునే
నిజంతో నడిచే బలంవంతులు…

ప్రజలంటే పిచ్చివాళ్ళు కారు
మౌనంగా అన్నీ వింటూ
మనసుతో  నడుచుకుకోనే
వోటు విలువ తెలిసిన విలువైన వాళ్ళు.

-చందలూరి నారాయణరావు
      9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *