‌ప్రగతి చాటేలా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

జిల్లా కలెక్టర్‌ ‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో సమావేశం

హైదరాబాద్‌/ ‌హనుమకొండ,ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్‌ ‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సి.ఎస్‌. ‌శాంతి కుమారి మాట్లాడుతూ, జూన్‌ 2 ‌నుంచి జూన్‌ 22 ‌వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలలో మన ప్రగతి చాటేలా విధంగా ఘనంగా నిర్వహించాలనిఅన్నారు. రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవా లని సూచించారు. రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయంపై తెలియజేయాలని, భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. జూన్‌ 8‌న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ, భోజనాలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. రైతు దినోత్సవం,ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు కావద్దని సీఎస్‌ అన్నారు.

విద్యుత్‌ ‌రంగంలో గత పరిస్థితి, నేడు సాధించిన ప్రగతి తెలియజేస్తూ నాడు- నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పోలీస్‌ ఆధ్వర్యంలో సురక్షా దివస్‌, ‌తెలంగాణ రన్‌ ‌నిర్వహించాలని అన్నారు. పారిశ్రామిక ప్రగతి, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలని అన్నారు. జూన్‌ 9‌న సంక్షేమ సంబురాలు సందర్బంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండవ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం ప్రారంభించాలని అన్నారు. బీసి కుల వృత్తుల ఆర్థిక సహాయంపై క్యాబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు అందిస్తామని, దాని ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేసి జూన్‌ 9‌న ప్రారంభించాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలు తెలియజేయాలని, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, క్రొత్త హాస్పిటల్స్  ఏర్పాటు, అందిస్తున్న అదనపు సేవలను వివరించాలని, వైద్య, ఆరోగ్య శాఖ దినోత్సవం నాడు కేసిఆర్‌ ‌న్యుట్రిషన్‌ ‌కిట్‌ ‌ప్రారంభించాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధించిన విజయాలు ఘనంగా చాటాలని సీఎస్‌ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్బంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని, సఫాయిన్న సలాం అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

మిషన్‌ ‌భగీరథ క్రింద ఇంటింటికి తాగునీటి సరఫరా, గిరిజనోత్సవం, పెరిగిన పచ్చదనం, విద్యాశాఖలో సాధించిన ప్రగతి పక్కాగా తెలియజేయాలని, ఆధ్యాత్మిక రంగంలో సాధించిన ప్రగతి , అమరుల సంస్కరణ కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌మాట్లాడుతూ,జూన్‌ 2 ‌న ఉదయం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి కలెక్టరేట్‌ ‌ప్రాంగణంలోని పరేడ్‌ ‌గ్రౌండ్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో అన్ని శాఖల ద్వారా సాధించిన ప్రగతి వివరించేలా పకడ్బందీగా దశాబ్ది వేడుకలను నిర్వహిస్తామని అన్నారు. 55 రైతు వేదికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌లోసమీకృత జిల్లా కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్‌ ‌సి క్తా పట్నాయక్‌, అదనపు కలెక్టర్‌ ‌సంధ్యారాణి, డి.సి.పి. ఎమ్‌.ఏ ‌బారి లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ట్రైనీ కలెక్టర్‌ ‌శ్రద్ధ శుక్ల,డీఆర్‌ఓ ‌చంద్ర, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్‌ ‌కుమార్‌, ‌సీపీఓ సత్యనారాయణ రెడ్డి,పరకాల ఆర్దీఓ రాము,విద్యా, వైద్య, ఆరోగ్య, మున్సిపల్‌,‌వ్యవసాయ, విద్యుత్‌,‌పరిశ్రమిక  రెవిన్యూ,సంక్షేమ జిల్లా ఉన్నత అధికారులు , పలువురు ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *