తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బిఆర్‌ఎస్ మాత్రమే
పార్లమెంట్ స్థాయి సవిూక్షలో కెటిఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3:
తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్.. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. గత పదేళ్ల కార్యాచరణ చూస్తే పార్లమెంట్ చూస్తే తెలంగాణ అనే మాట ప్రతి సమయంలో ప్రతిధ్వనించిందంటే.. దానికి బీఆర్‌ఎస్ ఎంపీలు. దిల్లీలో వాయిస్ అంటే బీఆర్‌ఎస్ అనే మాట అందరికీ తెలుసు. కాంగ్రెస్, బీజేపీ కానీ అన్ని రాష్ట్రాల్లో ఇదో రాష్ట్రంగా చూస్తాయి. కానీ, మేం కూడా ఇతర రాష్టాల్రకు విస్తరించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు ప్రధాన కేంద్రం హైదరాబాద్, తెలంగాణ. మా ప్రధాన ఎజెండానే తెలంగాణ కాబట్టి.. తెలంగాణ కోసం.. సమస్యలు, హక్కులు, వాటాల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది.. బలంగా కృషి చేయగలిగేది బీఆర్‌ఎస్ మాత్రమే. అందుకే అంటున్న తెలంగాణ బలం, గళం, దళం బీఆర్‌ఎస్. అందుకే పార్లమెంట్‌లో ప్రశ్నించాలన్నా.. ఏ అంశంపై లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది.. పోరాడగలిగేది బీఆర్‌ఎస్ మాత్రమే అనే మాటను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఓ ప్రత్యేకమైన రాజకీయ అస్థిత్వం ఉంటుంది. ప్రతి పార్టీకి ఓ ప్రత్యేకమైన అస్థిత్వం ఉంటుంది. ఆ రాష్ట్రానికి గుర్తింపును.. గౌరవాన్ని తెచ్చే లీడర్ ప్రతి రాష్టాన్రికి ఉంటారు. సొంత బలంతో, గట్టి గళంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అలా ఉన్నప్పుడే ఆ రాష్టాన్రికి విలువ ఉంటుంది.
బెంగాల్‌లో అనగానే గుర్తించేది మమతా బెనర్జీ. తమిళనాడు అనగానే గుర్తుకు వొచ్చేది డీఎంకే స్టాలిన్.. లేదంటే అన్నా డీఎంకే పార్టీ గుర్తుకు వొస్తుంది. ఏపీ అంటే గుర్తుకు వొచ్చేది జగన్.. చంద్రబాబు నాయడు. అక్కడ రెండు పార్టీలదే అక్కడ ప్రభావం ఉన్నది. ఒడిశా అనగానే గుర్తుకు వొచ్చేది నవీన్ పట్నాయక్. బీహార్ అంటే గుర్తుకు వొచ్చేది నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, మహారాష్ట్ర అనగానే గుర్తుకు వొచ్చేది శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే. తెలంగాణ అంటే గుర్తుకు వొచ్చేది భారతదేశమంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తుకు వచ్చే రూపం కేసీఆర్, బీఆర్‌ఎస్’ అని తెలిపారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని మాట్లాడినా నిర్వివాదమైన అంశం.. ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదు. పవర్‌ఫుల్ నేతలతో ఆయా రాష్టాల్రకు ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్‌తో తెలంగాణ అనే రాష్ట్రం వొచ్చింది.. ఆ రాష్టాన్రికి అస్థిత్వం వొచ్చింది. తెలంగాణ అనే పదానికి పర్యాయపదంగా కేసీఆర్ మారారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కోసం 32 రాజకీయ పార్టీలను ఒప్పించినా.. పార్లమెంట్‌లో ఫోర్త్‌స్థాయి ఎంప్లొయ్ నుంచి ప్రధానిమంత్రి దాకా అందరినీ కలిశారు. ఆయనను చూడగానే తెలంగాణ గుర్తుకు వొస్తుందనే విధంగా కేసీఆర్ ఎక్కని కడప లేదు.. మొక్కని బండ లేదు అన్నట్లు ఆ నాడు విస్తృతంగా దిల్లీలో ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లే రాష్ట్రం సాకారమైన విషయాన్ని గుర్తు చేస్తున్నా’నన్నారు.





