పర్యావరణహితంగా విశ్వనగరంగా హైదరాబాద్‌

ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం
నాలాల్లో ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలు
పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి  కెటిఆర్‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌హైదరాబాద్‌ ‌నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ చేయలేమని అన్నారు. ప్రజలు ఇది తమ నగరం అని గుర్తించి ముందుకు సాగాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లోని అడ్మినిస్టేల్రివ్‌ ‌స్టాఫ్‌ ‌కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌డియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆవరణలోని చెట్ల వల్ల ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది. ఏసీ ఆడిటోరియం కంటే కూడా బాగుంది అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. మన నగరం జీవన ప్రమాణాలలో నివాసయోగ్యంగా ఉంది. ఇంకా నగరం అభివృద్ధి చెందడానికి జరగాల్సిన పని కూడా చాలా ఉంది. సరిగ్గా 9 ఏండ్ల కింద ఏర్పాటైన తెలంగాణలో నగరం, నాయకత్వం, మౌలిక వసతుల గురించి ఎన్నో అపోహాలు, అనుమానాలు ఉండేవి. కానీ ఇవాళ 10వ వసంతలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్కడ ఏ ర్యాంకింగ్‌ ‌తీసుకున్నా.. ప్రతి దాంట్లో అగ్రభాగాన నిలుస్తూ దేశానికే దిక్సూచిగా మారింది. సెంటర్‌ ‌ఫర్‌ ‌సైన్స్ ఎన్విరాన్‌మెంట్‌ ‌నివేదికలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విడుదల చేసిన తాజా బుక్‌లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
మిగతా రాష్టాల్రతో పోల్చితే చాలా ముందు వరుసలో ఉన్నాం. ఇది రాష్టాన్రికి గౌరవ కారణం. సాగునీరు, తాగునీరు, అటవీ సంపద, పంచాయతీ రాజ్‌, ‌పట్టణాభివృద్ధి, పరిశ్రమల్లో తనదైన ముద్ర వేస్తున్నారు కేసీఆర్‌. ఏ ‌రంగాన్ని కూడా కేసీఆర్‌ ‌విస్మరించలేదు. అన్ని రంగాల్లో హైదరాబాద్‌, ‌తెలంగాణ అగ్రభాగానా ఉంటున్నాయని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. దేశంలోనే హైదరాబాద్‌ ఉత్తమ నగరంగా ఉందని పలు నివేదికలు వెల్లడించాయని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ ‌బాగానే ఉంది. ప్రపంచంతో పోల్చితే విశ్వనగరం కావాలంటే చాలా మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. స్పష్టమైన ఎజెండా, దక్షత గల నాయకత్వం, అన్నింటికి మించి ఇతరులతో కలిసి పని చేసే మనస్తత్వం ఉండాలి. ఒక వ్యక్తి, సంస్థ గానీ సర్వం నాకే తెలుసు. ప్రపంచం మొత్తం నాకే తెలుసు అనుకుంటే ఎక్కడికి పోలేవు అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. మాన్‌సూన్‌కు సంబంధించి చాలా పనులను పర్యవేక్షిస్తున్నాం అని కేటీఆర్‌ ‌తెలిపారు. నాలాలను క్లీనింగ్‌ ‌చేసేటప్పుడు.. పూడికలో వచ్చే కొన్నింటిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సోఫాలు, దిండ్లు, ఇతరత్రా వస్తువులు అనేకం బయటపడుతాయి. సూపర్‌ ‌మార్కెట్లో కూడా దొరుకుతాయో లేదో కానీ నాలాలో అన్నీ దొరుకుతాయి. పనికిరాని వస్తువులను నాలాల్లో ఎందుకు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకింత అనాగరికంగా ఆలోచిస్తున్నామో అర్థం కాదు. నాగరిక సమాజంలో బతకాలనే వారు ఇలా చేయరు. ఇల్లు మాత్రమే నాది.. నాలా నాది కాదు అనే భావనతో బతకొద్దు అని కేటీఆర్‌ ‌సూచించారు. మార్పు రానంత వరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం ఉండదన్నారు. నగరం బాగుపడాలంటే పౌరుల భాగస్వామ్యం తప్పకుండా అవసరం అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుంది. నాగరికంగా బతికే అవకాశం కలుగుతుంది. అనాగరిక లక్షణాలు సమాజంలో అనేకం ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పది శాతం బ్జడెట్‌ను పచ్చదానికి కేటాయించారు. చెట్లను నాటి కాపాడాలని కేసీఆర్‌ ఆదేశించారు. లేదంటే సర్పంచ్‌, ‌కౌన్సిలర్‌ ఉద్యోగం పోతుందని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాత్రమే. రతి గ్రామంలో ఒక నర్సరీ, ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌ ‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సదుపాయం ఇతర రాష్టాల్ల్రో లేదు అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.
ఐటి రంగంలో తెలంగాణ దూకుడు…
లక్ష 83 వేల కోట్లకు చేరుకున్న ఐటీ ఎగుమతులు
వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ఐటీ రంగంలో హైదరాబాద్‌ ‌నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. టీ హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ ‌విడుదల చేశారు.  సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ. 56 వేలు కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక లక్ష 83 వేల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్‌లో 3 లక్షల 20 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు. కరోనా వచ్చాక ఐటీ రంగంపై అనేక అపోహాలు వచ్చాయి. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారం ఏ లేదు. మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు కేటాయిచిన ఐటీఐఆర్‌ను కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ నిలదొక్కుకుని ఐటీ రంగాన్ని అగ్రభాగానా నిలబెట్టామని కేటీఆర్‌ ‌తెలిపారు. ఐటీ రంగం దూసుకెళ్లేందుకు మా టీమ్‌ ‌బాగా పని చేస్తోందని కేటీఆర్‌ ‌ప్రశంసించారు.
వాషింగ్టన్‌లో అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యాను. బెల్లంపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు వాషింగ్టన్‌ ‌సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. అనేక అమెరికా కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని కేటీఆర్‌ ‌తెలిపారు. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్‌ ‌హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. గూగుల్‌ ‌కూడా హైదరాబాద్‌లో అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోంది. భారత్‌ ‌కంపెనీ ఎల్‌టీఐ మైండ్‌ ‌ట్రీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెడుతోంది. గ్రిడ్‌ ‌డైనమిక్స్ ‌హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. సైబర్‌ ‌నేరాలు అరికట్టేందుకు సైబర్‌ ‌క్రై ‌సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ ‌తెస్తున్నాం అని కేటీఆర్‌ ‌వివరించారు.హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ బాష్‌ ‌ముందుకొచ్చిందని కేటీఆర్‌ ‌తెలిపారు. మైక్రోసాప్ట్ ‌డేటా సెంటర్‌ ‌హైదరాబాద్‌కు వస్తోంది. లండన్‌ ‌స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ‌గ్రూప్‌ ‌కేంద్రం ఈ ఏడాది వస్తుంది. మరో రెండేళ్లలో డజోన్‌ ‌ప్రొడక్ట్ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ ‌వస్తోంది. అమెరికాకు చెందిన వార్నర్‌ ‌బ్రదర్స్ ‌డిస్కవరీ హైదరాబాద్‌లో ఐడీసీ నిర్మిస్తోంది. అమెరికాకు చెందిన జాప్‌కామ్‌ ‌సెంటర్‌ ‌కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. టెక్నిప్‌ ఎఫ్‌ఎం‌సీ కంపెనీ సెంటర్‌ ‌కూడా వస్తోందన్నారు కేటీఆర్‌.‌వరంగల్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నల్లగొండ, సిద్దిపేట, సిరిసిల్ల వంటి పట్టణాలకు కొత్త సంస్థలు వస్తున్నాయని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. వరంగల్‌కు టెక్‌ ‌మహీంద్రా, జెన్‌ప్యాక్‌ ‌వంటి సంస్థలు వస్తున్నాయి. మహబూబ్‌ ‌నగర్‌లోనూ కొన్ని సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. నల్లగొండ వంటి టైర్‌ 2 ‌పట్టణాలకు పరిశ్రమలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్‌ ‌సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హా ఇచ్చింది. త్వరలోనే ఈ మొబిలిటీ వీక్‌ ‌నిర్వహించబోతున్నాం. టీ వర్కస్ ‌సంస్థకు ఇటీవలే కేంద్రం అవార్డు ఇచ్చింది. టీ వర్కస్ ‌స్ఫూర్తితో మహారాష్ట్ర ఎం వర్కస్ ఏర్పాటు చేయబోతుంది అని కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *