పరేడ్‌ గ్రౌండ్స్‌ సైనిక స్మారక్‌ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి అమరులకు నివాళులు

ఇంటివద్ద  జెండా ఎగురేసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వీరుల సైనిక్‌ స్మారక్‌ వద్ద యుద్ధ వీరులకు సిఎం నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌కు స్వాగతం పలికి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో అనారోగ్యం నుంచి కోలుకుంటున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను  సిఎం పరామర్శించారు. అనంతరం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌కు వెళ్లి గుండె సంబంధిత వ్యాధి నుంచి కోలుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు. ఇక సాయంత్రం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమం తేనీటి విందులో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *