పరిపాలనా దక్షురాలు ఇందిరా ప్రియదర్శిని

‘‘ఇం‌దిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని హోదాలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోని పరిపాలనలో చెరగని ముద్ర వేసుకున్న సాటిలేని మేటి. ’’

నేడు ఇందిరా గాంధీ జయంతి

ఇందిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని హోదాలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోని పరిపాలనలో చెరగని ముద్ర వేసుకున్న సాటిలేని మేటి. ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్‌ 19, 1917 – అక్టోబర్‌ 31, 1984) ‌భారత దేశపు మొట్ట మొదటి, ఏకైక మహిళా ప్రధాన మంత్రి. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్స రములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్‌ ‌బహదుర్‌ ‌శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పని చేసింది.ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధాన మంత్రిగా పనిచేసింది. 1917, నవంబర్‌ 19 ‌తేదీన జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, కమలా నెహ్రూల ఏకైక సంతానంగా జన్మించింది ఇందిరాగాంధీ. తాను ఆడుకునే ప్రతీ ఆటలో బ్రిటిష్‌ ‌వారిని ఎదిరింది పోరాడే ఒక దేశభక్తురాలి గానే తనను ఊహించుకుంటూ ఆడుకొనేది.

18 సంవత్సరాల వయస్సులోనే ఆమె వానర సేనను నడిపి ఉద్యమాలలో అనుభవం సంపాదించింది. ఇందిర పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్‌ ‌పరీక్షలో ఉత్తీర్ణు రాలయింది. విశ్వభారతి విశ్వ విద్యాలయంలో చదివింది. ఇంగ్లండు నందలి ఆక్స్ ‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం లోని సోమర్‌ ‌విల్‌ ‌కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్య్రం సంపాదించడంకోసం లండనులో స్థాపించ బడిన ఇండియాలీగ్‌ ‌లో, 1930 లో చేరింది. 1936లో తల్లి కమలా నెహ్రూను కోల్పోయింది. 1938 లో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌లో చేరింది. జర్నలిస్ట్ ‌ఫిరోజ్‌ ‌తో పరిచయము క్రమంగా పరిణ యానికి దారి తీసింది. నెహ్రు కాశ్మీరీ బ్రాహ్మణులు కావటం, ఫిరోజ్‌ ‌పూర్వీకులు పర్షియా నుండి భారత దేశానికి వలస వచ్చి స్థిరపడిన పార్సీలు కావటంతో పెళ్లి చేయటానికి ఆ సమయంలో నెహ్రు ఒప్పుకోలేదు, ఆ తర్వాత నెహ్రును మహాత్మా గాంధీ ఒప్పించడంతో, 1942-03-26న ఇందిరా (25), ఫిరోజ్‌ (29)‌ల పెళ్లి చేసారు.1942లో క్విట్‌ ఇం‌డియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళి 1943 మే 13 న విడుదలైంది. జైలులో ఉండగానే ఆమె ఒక మగ పిల్ల వాడికి తల్లి కాగా, ఆ బాలునికి రాజీవ్‌ అని పేరు పెట్టారు. రాజీవ్‌ ‌గాంధీకి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, వారు లక్నో వెళ్లగా, అక్కడ నేషనల్‌ ‌హెరాల్డు పత్రికా సంపాదకునిగా ఫిరోజ్‌ ‌గాంధీ పనిచేసిన సమయంలో సంజయ్‌ ‌గాంధీ జన్మించాడు.

భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి ఆమె తండ్రితో జీవించింది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూకు పోటీగా ఫిరోజ్‌ ‌గాంధీ రాయ్‌బరేలీ నియోజక వర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి , ఆ ఎన్నికల్లో తండ్రిని గెలిపించింది. ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం ప్రజలను ఆకర్షించేవి. 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఆమెను ఎన్నుకున్నారు. 1960 సెప్టెంబర్‌ 8‌న ఫిరోజ్‌ ‌గాంధీ మరణించాడు. 1964 మే 27న జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ మరణిం చడంతో ఇందిర జీవితంలో పెనువిషాదం ఏర్పడింది. తండ్రి మరణానంతరం ఇందిర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్‌ ‌హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.

1966 జనవరి 24న ఇందిర మొదటి సారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్ట మొదటి మహిళా ప్రధానమంత్రిగా సంచలనం సృష్టించింది. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టలేని రికార్డు అది. ఇందిర 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. 1975-06-26 భారత ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 1977-03-22 ఇందిరా గాంధీ భారత ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 1977లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయట పడింది. ఇందిర సొంత నియోజకవర్గ మైన రాయ్‌ ‌బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్‌ ‌నారాయణ్‌ ‌చేతిలో ఓడిపోయింది. 1977-10-03 ఇందిరా గాంధీని అరెస్టు చేశారు. ఇది జాతీయ అసంతృప్తి, దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది. 1978లో ఇందిరా కాంగ్రెస్‌ ‌పార్టీని ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగు పెట్టింది.

1980-01-06 ఎన్నికలలో ఇందిరా గాంధీ కాంగ్రెస్‌ ‌మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో సారి ప్రధాన మంత్రి బాధ్యతలను చేపట్టింది. ఈసారి విశేషం ….ఆమె స్వయంగా ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని మెదక్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యతతో గెలుపొందింది. రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయీ కరణ, బంగ్లా శరణాగతుల పునరావాసం లాంటి నిర్ణయాలతో పాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. ఆమె 1984-06-05 ఇందిరా గాంధీ సిక్కు పవిత్ర స్థలమైన అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయం పై ఆపరేషన్‌ ‌బ్లూ స్టార్‌ ‌దాడి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 1984-10-31 భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు సత్వంత్‌ ‌సింగ్‌, ‌బితాంత్‌ ‌సింగ్‌ ‌లు న్యూ ధిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో కాల్చి హత్య చేశారు. 1984-11-03 ఇందిరా గాంధీ మృతదేహాన్ని దహనం చేశారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *