రెండు నెలల్లోనే కెఆర్‌ఎంబికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత
బోర్డు రెండో మినిట్స్‌లో ఆధారాలు ఉన్నాయి
సిఎం రేవంత్ మాటలు అర్ధసత్యాలు..అసత్యాలు…మితిమీ
మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్ కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత దిల్లీలో జరిగిన కేఆర్‌ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ… ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్‌ఎంబీ రెండో విూటింగ్ మినట్స్‌లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై దిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు.
తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం విూడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు, మితి విూరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్‌రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్‌ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వొచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ…సీఎం రేవంత్ నీచమైన పద్దతిలో కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలు చేశారని మండిపడ్డారు. రేవంత్ భాష, ధోరణి చూసి ప్రజలు అసహ్యంచుకుంటున్నారని ఆయన విమర్శించారు. విూడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిల్లీలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగిందని..నెల రోజుల్లోపు 15 అవుట్‌లెట్స్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని మినిట్స్‌లో చెప్పారని హరీష్ రావు అన్నారు.
ప్రాజెక్టులు అప్పగించింది నిజం కాకుంటే ఎందుకు ఖండిరచలేదని హరీష్ ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ రంకెలేస్తుందన్నారు. అబద్ధాల పునాదుల విూద ప్రభుత్వాలను నడపడం సరికాదన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదు..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. కేఆర్‌ఎంబీ విూటింగ్‌లో ప్రాజెక్టులు అప్పగించడానికి అంగీకరింనందుకే వివాదం మొదలైందన్నారు. జనవరి 17న దిల్లీలో జరిగిన విూటింగ్‌లో ప్రాజెక్టుల అప్పగింతకు ఆమోదం తెలిపారని అన్నారు. మినిట్స్‌లో అది స్పష్టంగా ఉందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదని విమర్శించారు. తాను 19న ప్రెస్‌విూట్ పెట్టి కడిగిన తర్వాత మేలుకున్నారన్నారు. తాము ఒప్పుకోలేదని లేఖ రాశారని చెప్పారు. ఫిబ్రవరి 1న రెండో కేఆర్‌ఎంబీ విూటింగ్ జరిగిందని..ఆ విూటింగులో కూడా ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు మినిట్స్‌లో ఉందన్నారు. అందులో పవర్ హౌజ్‌ల అప్పగింతకు మాత్రమే అభ్యంతరం చెప్పారని.. నీటి ప్రాజెక్టులపై మాత్రం అభ్యంతరం చెప్పలేదని మండిపడ్డారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి అబద్దాల పునాదుల విూద ప్రభుత్వాన్ని నడపాలని అనుకుంటున్నారన్నారు. ఇది శాంపిల్ మాత్రమే అని అసెంబ్లీలో పూర్తి వివరాలు చెబుతామన్నారు. పోతిరెడ్డి పాడు నుంచి నీరు తరలిస్తే పదవుల కోసం పెదవులు మూసుకున్నది తాము కాదని, ఆయన పక్కన ఉన్న ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి పెదవులు మూసుకున్నారని హరీష్ దుయ్యబట్టారు. 610, పులిచింతల, వైఎస్ అన్యాయానికి వ్యతిరేకంగా జూలై 4, 2005న మేము కేబినెట్ నుంచి బయటకు వొచ్చామని..తాము బయటకు వొచ్చాక మూడు నెలలకు పోతిరెడ్డి జీఓ వొచ్చిందన్నారు. టీడీపీలో ఉండి రేవంత్ ఆనాడు నోరు మూసుకున్నారని, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పోరాడిరది తాము, పీజేఆర్ మాత్రమేనన్నారు. తాము పోతిరెడ్డిపాడుపై 40 రోజులు అసెంబ్లీనీ స్తంభింపజేసినమని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.



