నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
వర్తమాన పరిస్థితులు పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. అభివృద్ది అసలుకే ఎసరు పెడుతున్నది.
గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్…అనే మాట అక్షర సత్యం. వర్తమాన మానవ చరిత్రను పరిశీలిస్తే గతమే మేలన్న అభిప్రాయం కలగక మానదు. ఆరుబయట ఆకాశంలో అందమైన జాబిల్లిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో కలసి పోయింది. పచ్చని పంట పొలాలతో, పసందైన ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన ప్రాణవాయువు ను పీలుస్తూ, అంటువ్యాధులను సైతం అవలీలగా జయించి, రసాయనిక పదార్ధాలు లేని, సహజసిద్దమైన బలవర్ధకమైన ఆహారాన్ని భుజించి, ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్ళు జీవించిన నాటితరం నాటి జీవన విధానం నేటి తరంలో అగుపించడం లేదు. కృత్రిమ వాతావరణంలో,కాలుష్య కారకాల మధ్య నిరంతరం అష్టకష్టాలు పడుతూ,ఆరోగ్యాలు చెడి, అంటువ్యాధుల బారిన పడి అలమటిస్తున్న జనవాహిని ఆవేదనలు,ఆక్రందనలు అత్యంత బాధాకరంగా ఉన్నాయి.

నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్న నాటి కాలంలో కూడా ప్రజలు ఎంతో విజ్ఞత ప్రదర్శించి, ప్రకృతిని దైవం గా ఆరాధించే వారు. విజ్ఞానం పెరిగిన కొద్దీ నేటి ప్రపంచం అజ్ఞానంతో అలమటిస్తూ, మితిమీరిన స్వార్ధంతో ప్రకృతి పై విధ్వంస కాండను కొనసాగిస్తున్నది. పెరిగిన జనాభా ఇతర జీవరాశుల అంతానికి నాంది పలికింది.
పెరిగిన జనాభాకు సరిపడా ఆహారం సమకూర్చడం కోసం ఆహర ధాన్యాల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఏర్పడింది. ఆహారోత్పత్తుల పెంపుదలకు పంటల్లో విరివిగా రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. క్రిమికీటకాదుల నుండి పంటలను సంరక్షించడానికి మోతాదుకు మించి, క్రిమి సంహారక మందులను వినియోగించడం వలన పంటలకు సహజమితృలైన పలు జీవరాశులు నశించిపోయాయి.వాతావరణంలో కాలుష్యం పెరిగింది. ఊహించని వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల నివాసాలకోసం పచ్చని పొలాలు, అడవులు విధ్వంసమైనాయి. అవసరాలకు మించి ఆకాశహర్మ్యాలు పెరిగి పోయాయి. పట్టణాల సంస్కృతి ని పల్లెలు సంతరించుకున్నాయి. నగరీకరణ వలన సహజసిద్దమైన వాతావరణం అంతరించింది. కలుషితాల వలన అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. ప్రకృతిలో పలు అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పచ్చదనం హరించుకు పోయింది. పచ్చదనం లోపించడం వలన వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల అతివృష్టి,కొన్ని చోట్ల అనావృష్టి వంటి విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి.తుఫానులు, వరదలు ఒకవైపు, కరువు కాటకాలు మరో వైపు తాండవిస్తున్నాయి.

ప్రకృతి విలయాలతో జనజీవనం అస్తవ్యస్తమౌతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పర్యావరణ పరిస్థితులపై దృష్టి సారించకపోతే ఇప్పటికే ప్రమాదపు అంచున ఉన్న ప్రపంచ మానవాళి తన మనుగడను కోల్పోయే ప్రమాదం ఉంది. పచ్చదనాన్ని పెంచి, పర్యావరణాన్ని పరిరక్షించడం లోనే సకల మానవాళి క్షేమంగా మనుగడ సాగించగలదు. పచ్చదనం యొక్క ప్రాధాన్యత చాటి చెప్పాలి.ఒక వైపు మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి చెబుతూనే,మరొక వైపు చెట్లను నరకడం పరిహాసప్రాయమౌతున్నది. ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్నాయి. ప్రజల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం గురించి, పచ్చదనం యొక్క ఆవశ్యకత గురించి పదే పదే చెబుతూనే ఉన్నా,అవన్నీ కేవలం మాటల వరకే పరిమితమౌతున్నాయి. సందర్భానుసారంగా
మొక్కుబడిగా మొక్కలను నాటి, వాటి సంరక్షణను గాలికొదిలేయడం వలన మొక్కలు నాటే కార్యక్రమాలు నగుబాటు పాలౌతున్నాయి.లక్ష్యసిద్ధికోసం చిత్తశుద్ధి అవసరం. పర్యావరణ సంరక్షణ సమిష్ఠి బాధ్యత. ప్రపంచంలో తలెత్తే పలు సమస్యలకు పర్యావరణ విధ్వంసమే మూలకారణం.

కాలుష్యకారకాలు విజృంభించడం భూఉష్ణోగ్రతలు భరింపశక్యం కాకుండా పెరగడం ఊహాతీతమైన ప్రకృతి విలయాలకు సంకేతం. ఆధునిక పరిజ్ఞానం ప్రజల ఆరోగ్యాలపై పెను ప్రభావం చూపుతున్నది.ఆధునిక నాగరికత జనావాసాలను కాంక్రీటు అరణ్యాలుగా మారుస్తున్నది. చెరువులు,ఇతర నీటి వనరులు నశించిపోతున్నాయి. సముద్ర జలాలు కలుషితమై సముద్ర జీవాలు అంతరించి పోతున్నాయి. ప్రకృతి లో చోటు చేసుకుంటున్న పరిణామాలు జీవవైవిధ్యానికి ముప్పుగా మారాయి.మానవ స్వార్ధం ఇతర జీవరాశులకు భూగ్రహంపై చోటులేకుండా చేస్తున్నది. విలాసవంతమైన జీవన విధానం జీవ వైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నది.దూరదృష్టి నశించి చెట్లను నరకడం పెరిగిన మానవ పైత్య ప్రకోపానికి నిదర్శనం. ప్రకృతి ని సైతం జయించాలనే దురాలోచనతో తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్న మానవ నైజం అత్యంత ప్రమాదభరితం.ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి నాలుగున్నర దశాబ్దాల క్రితమే ఊహించింది.1972 వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణం పై రూపొందించిన ‘‘స్టాక్ హోం’’ డిక్లరేషన్’’ లో అనేక ప్రతిపాదనలు చేసింది.
1974 వ సంవత్సరం జూన్ 5 వ తేదీన అమెరికా లోని ఆర్ధిక,విద్యా, సాంస్కృతిక నగరమైన ‘‘స్పోకనే’’ లో ‘‘ఒకే ఒక భూమి’’ అనే నినాదంతో భూగ్రహ రక్షణ పర్యావరణ పరిరక్షణ పై ఆధార పడి ఉందన్న సత్యాన్ని చాటి చెబుతూ,మొదటి పర్యావరణ దినోత్సవం జరిగింది. అప్పటి నుండి ప్రతీ ఏటా జూన్ 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుగుతున్నది. మనకున్నది ఒకే ఒక సురక్షిత ప్రదేశం భూగ్రహం.మానవ చర్యలతో భూగ్రహం అంతరించి పోతే ఇతర గ్రహాల్లో తిష్ఠవేయవచ్చనే ఆశ అత్యాశే కాగలదు.ఎన్నో సంవత్సరాల నుండి ఇతర గ్రహరాశుల్లో జీవరాశుల మనుగడ గురించి అన్వేషిస్తున్నా,ఆశించిన ఫలితం దక్కలేదు. మిలియన్ సంవత్సరాల క్రిందట కొన్ని గ్రహాల్లో నీరుందని, వాటి జాడలు కనిపించాయని చెప్పడానికే ప్రపంచ పరిశోధనలు వినియోగపడ్డాయి. వేలాది కోట్ల రూపాయలతో ఇతర గ్రహరాశుల గమ్యం గురించి పరిశోధనలు చేస్తున్న పలు దేశాలు మానవ నివాసయోగ్యమైన భూగ్రహ సంరక్షణ పై దృష్టి సారించడం శ్రేయస్కరం.
స్వీడన్ సారథ్యంలో జరిగే 2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవ ముఖ్యాంశం ‘‘ఓన్లీ వన్ ఎర్త్’’. మానవ తప్పిదాలతో విధ్వంసమైన పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడమే ధ్యేయంగా ఈ సంవత్సర పర్యావరణ దినోత్సవం జరుగుతున్నది. ఈ వేదిక పర్యావరణ పరిరక్షణ బాధ్యత పై పలు సూచనలు చేసే అవకాశాలున్నాయి. ఒకవైపు ప్రపంచ జనాభా 800 కోట్ల కు చేరువులో ఉంది. మరోవైపు ప్రకృతితో మమేకమై మనతో పాటు జీవించే పలుజీవరాశులు అంతర్ధానమై పోయాయి.
మానవ తప్పిదాలు మానవ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.అడవులు,నదీనదాలను కాపాడు కోవాలి. పచ్చదనం యొక్క ప్రాధాన్యత గుర్తించాలి. భారతీయ సంస్కృతిలో మిళితమైన ప్రకృతి ఆరాధన ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి. దురదృష్టవశాత్తూ మన సంస్కృతి ని మనం మరచిపోయాం. పాశ్చాత్య పద్ధతులకు ఆకర్షితులమై, మన పూర్వీకులు ఆచరించిన జీవన శైలిని విస్మరించి,పంచభూతాలతో నిండిన పర్యావరణ వ్యవస్థకు తూట్లు పొడిచాం. కరోనా సంక్షోభం అనాదిగా వస్తున్న భారతీయ జీవన శైలిని తిరిగి ఆచరించవలసిన కర్తవ్యాన్ని చాటి చెప్పింది.పర్యావరణ పరిరక్షణ బాధ్యత మరింతగా ప్రజలకు చేరువ కావాలి. మొక్కుబడిగా సాగే పర్యావరణ దినోత్సవాల వలన,ఆచరణ లేని ఉపన్యాసాల వలన ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. పర్యావరణ పరిరక్షణపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలి. కాలుష్య కారకాలను అరికట్టి వాతావరణ సమతుల్యతను కాపాడాలి. గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలపై దృష్టి సారించాలి. ఇతర జీవరాశుల మనుగడకు మార్గం చూపాలి. కాలుష్యాన్ని వెదజల్లే వాహన వినియోగాన్ని తగ్గించాలి కాలుష్య రహితమైన సాధనాలను వినియోగించాలి. పర్యావరణ పరిరక్షణపై స్వీడన్ లో జూన్ 5 వ తేదీన నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేదిక అద్భుతమైన ఫలితాల కోసం అన్ని అవకాశాలను అన్వేషించాలి.
సుంకవల్లి సత్తిరాజు
సంగాయగూడెం,దేవరపల్లి మండలం, తూ.గో.జిల్లా
9704903463.