‘‘ పచ్చని పర్యావరణం – అవనికి నిండుదనం’’
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్తమాన పరిస్థితులు పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. అభివృద్ది అసలుకే ఎసరు పెడుతున్నది. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్…అనే మాట అక్షర సత్యం. వర్తమాన మానవ చరిత్రను పరిశీలిస్తే గతమే మేలన్న అభిప్రాయం కలగక మానదు. ఆరుబయట ఆకాశంలో అందమైన జాబిల్లిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో…