పంతుళ్ళ ప్రమోషన్లు పట్టాలెక్కేది ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయ పదోన్నతులు జరిగాయి. గత ఎనిమిది సంవత్స రాలుగా పంతుళ్లు ప్రమోషన్స్ ‌కై కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి వేసవిలో పదో న్నతులు ఉంటాయని ఎదురు చూడడం ఎండమావిలా వాళ్ళ ఆశ లు ఆవిరి కావడం శరా మామూలు అయింది. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో మినహా అన్ని శాఖలలో ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా సాగుతున్న మరి పాఠశాల విద్యాశాఖ పై ఈ వివక్ష ఎందుకన్నది ఉపా ధ్యాయ వర్గాల మెదళ్లను తొలుస్తున్న బేతాళ ప్రశ్న. అక్షర సేద్యం చేస్తూ ఫలమంతమైన ఫలాలను సమా జానికి అందిస్తున్న నిత్య హాలికులైన ఉపాధ్యాయులకు మాత్రము ఎం ఎస్‌ ‌పి (మ్యాక్సిమం సర్వీస్‌ ‌ప్రమోషన్స్) అం‌దకుండానే నిరాశతో పదవీ విరమణ పొందుతున్నారు.
 అంతా ఇంచార్జీల మయం
తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా శాఖలో ముఖ్యంగా జిల్లాల విద్యాశాఖ పర్యవేక్షణలో అత్యంత కీలకమైనవి జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులు. ఇవి కూడా ఇంచార్జీలతోనే కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన 23 జిల్లాలకు నూతన విద్యాధికారులను నియమించలేదు. పైపెచ్చు పూర్తిస్థాయి సిబ్బంది లేనటువంటి ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్లకు బీఈడీ, డైట్‌ ‌లెక్చర్లకు మరియు డీఈఓ కార్యాలయం అసిస్టెంట్‌ ‌డైరెక్టర్స్ ‌కు డి ఇ వో లుగా అదనపు బాద్యతలను అప్పగించారు. ఇక్కడ ఇంకొక విడ్డూరం ఏంటంటే కొన్ని చోట్ల రెండు జిల్లాలకు కలిపి ఒకే డీఈఓ ఇంచార్జీగా ఉన్నారు. మండల విద్యా వ్యవస్థలో కీలక భూమిక పోషించే మండల విద్యాధికారుల పోస్టుల పరిస్థితి మరీ అధ్వానం. రాష్ట్రవ్యాప్తంగా 528 ఎంఈఓ పోస్టులు ఉండగా కేవలం 21 మంది మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓ ‌లుగా పనిచేస్తున్నారు. మిగతా 507 పోస్టులలో ఇంచార్జీల పాలన కొనసాగుతుంది. ఇక్కడ ఇంకా ఘోరంగా ఒక ఎంఈఓ సుమారుగా నాలుగైదు మండలాలకు ఇంచార్జీలుగా ఉన్నారు. ఇక ఉన్నత పాఠశాలలో గెజిటెడ్‌ ‌హెడ్‌ ‌మాస్టర్ల పోస్టుల విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2000 పాఠశాలలలో జిహెచ్‌ఎం ‌పోస్టులలో సీనియర్‌ ‌స్కూల్‌ అసిస్టెంట్లు ఇంచార్జీలుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులన్నీ నూటికి నూరు శాతం పదోన్నతులతోనే పూరించాల్సినవి. ఇక డిప్యూటీ డీఈవోల పోస్టుల విషయానికొస్తే ఇవి దాదాపుగా అంతర్ధానమైనట్టే.

 ప్రత్యామ్నాయ పరిష్కారం లేదా!
తమతో విద్యనభ్యసించిన విద్యార్థులు ఒక సాఫ్ట్ ‌వేర్‌ ‌కంపెనీలో లేదా ఒక రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ‌గా నియామకమై తమ కళ్ళముందే టీమ్‌ ‌లీడర్లుగా ఎమ్మార్వోలుగా పదోన్నతులు పొందుతున్నా , ఉపాధ్యాయులు మాత్రం అదే పోస్టులో దశాబ్దాలుగా కొనసాగుతూ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఒక ఉన్నత పాఠశాలలో జిహెచ్‌ఎం ‌పోస్టు ఖాలీగా  ఉంటే అదే పాఠశాలలో సీనియర్‌ ‌స్కూల్‌ అసిస్టెంట్‌ ఇం‌చార్జీ హెచ్‌ఎం ‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ ‌లేనప్పుడు ఒక ఎస్జీటీ టీచర్‌ ఇం‌చార్జీ ప్రధాన ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. అందుకే 12 సంవత్సరాలు సర్వీస్‌ ‌పూర్తి చేసుకొని సరైన విద్యార్హతలు కలిగి ఉన్న ఉపాధ్యాయులను తదుపరి పోస్టుకు ఆటోమేటిగ్గా పదోన్నతి కల్పించాలి. ఉదాహరణకు ఎస్జీటీగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని సరైన విద్యా అర్హతలు కలిగి ఉంటే వారిని స్కూల్‌ అసిస్టెంట్‌ ‌గా ప్రమోట్‌ ‌చేయాలి. అలాగే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని అన్ని డిపార్ట్మెంట్‌ ‌పరీక్షలు పాస్‌ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను జిహెచ్‌ఎం‌లుగా ఆటోమేటిగ్గా పదోన్నతులు కల్పించాలి.

ఇలా ఆటోమేటిక్‌ ‌ప్రమోషన్‌ ఇచ్చిన తర్వాత  ఖాలీలు  ఏర్పడినప్పుడు వారిని అవసరమైన చోటికి పంపించాలి. అంతవరకు వారి సేవలను పాత స్థానంలోనే వినియోగించుకోవాలి.ఇలా చేయడం ద్వారా ఉపాధ్యాయుడికి తన సర్వీస్‌ ‌లో అసంతృప్తి లేకుండా తర్వాత ప్రమోషన్‌ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఉత్సాహంగా తన విధులు నిర్వహిస్తాడు. దీని ద్వారా ప్రభుత్వం పై పెద్దగా భారం కూడా పడదు. సీనియారిటీ పరంగా లేదా కనీసం 12 సంవత్సరాలు ఏది ముందైతే దాని ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాలలో కారుణ్య నియామకాల ద్వారా రికార్డు అసిస్టెంట్‌ ‌లేదా జూనియర్‌ అసిస్టెంట్‌ ‌గా నియామకం అయిన పీజీ అర్హత గల వారికి ఎలాంటి బోధనా అనుభవం లేకున్నా జూనియర్‌ ‌లెక్చరర్స్ ‌గా పదోన్నతులు కల్పిస్తున్నారు. కానీ అన్ని విద్యార్హతలు కలిగి సుదీర్ఘ బోధనా అనుభవం కలిగి ఉన్న ఉపాధ్యాయులకు మాత్రం ఈ అవకాశం కల్పించకపోవడం ఉపాధ్యాయ లోకాన్ని నైరష్యంలోకి నెట్టివేస్తుంది. కనుక దామాషా ప్రాతిపాదకన ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించాలి. అనాదిగా ఒక మంచి సమాజానికి పునాదులు వేస్తూ జాతి నిర్మాతలను తీర్చిదిద్దుతున్న గురువులు క్షోభకు గురి కావడం ఏ సమాజానికైనా హితం కాదు. గురువుల సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.

image.png
బొల్లం సునీల్‌ ‌కుమార్‌
‌జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌)
‌మహబూబ్‌ ‌నగర్‌ ‌గ జిల్లా, 9059666011

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *