‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు చాలా గౌరవప్ర దంగా ఆనందంగా జీవించేవారని చెప్పవచ్చు.నేటి ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యత తగ్గిపోయి చిన్న కుటుంబాలు ఎక్కువైపోయాయి. ఉద్యోగాల వేటలో,ఉపాధి వెతుక్కునే క్రమంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో చిన్న కుటుంబాల ప్రాధాన్య తలు పెరిగిపోయాయి. నిజానికి వృద్ధులు ఇంట్లో ఉంటే ఆ కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి వారి అనుభవాలు ఎంతగానో తోడ్పడతాయి. వారు శారీరకంగా బలహీనంగా ఉన్న వారి అనుభవాలు, తెలివితేటలు కుటుంబ శ్రేయస్సుకు, అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.
వృద్ధులను మంచిగా చూసుకుంటున్న కుటుంబాల్లో మానవతా విలువలు ముఖ్యంగా పిల్లల్లో నైతిక విలువలు పెరుగుతాయి.వారిని చిరునవ్వుతో పలకరిస్తే వారి జబ్బులు కూడా త్వరగా నయమవుతాయి.ఒక ఆత్మీయ పలకరింపు, ఆత్మీయ స్పర్శ వారిలో ఎనలేని ఆనందాన్ని కలగజేస్తాయి. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని వాటిని విజయవంతంగా అధిగమించిన అనుభవం వారి సొంతం అని చెప్పవచ్చు. వృద్ధులు ఇంట్లో ఉంటే జ్ఞాన సంపద మనతో ఉన్నట్లే.మన సంస్కృతి సాంప్రదాయాలకు కూడా వారు వారదులుగా కొనసాగుతారు. తల్లిదండ్రులను కనిపించే దేవుళ్ళుగా పూజించే తరం నేడు క్రమక్రమంగా కనుమరుగవుతున్నది.ఉరుకుల పరుగుల జీవిత పోరాటంలో పెద్దల యోగక్షేమాలు చూసేవారు లేకుండా పోతున్నారు. నేటితరం సంపాదనకే అధిక ప్రాధాన్యతనిస్తూ మానవ సంబంధాలను ఆర్థిక సంబం ధాలుగా మారుస్తున్నారు.ముదిమి వయసులో ప్రశాంతంగా సాగిపోవాల్సిన కాలం వారి జీవితాల్లో ఎనలేని అలజడిని రేపుతున్నది.జీవితమంతా బిడ్డల భవిష్యత్తు కొరకు ఎన్నో త్యాగాలు చేసి వారిని అభివృద్ధిలోకి తెస్తే వృద్ధాప్యంలో వారిని వారి పిల్లలు ఆస్తుల కొరకు,చాదస్తం అంటూ వారిని ఇంటి నుంచి గెంటి వేయడం, మానసికంగా హింసించడం మనం నేడు చూస్తున్నాం.
పిల్లల అభివృద్ధి కొరకు,క్షేమం కొరకు పరితపించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో వారి నుంచే వేధింపులు ఎక్కువవుతున్నాయి. కుటుంబ సభ్యుల మాటలతో,చేతలతో మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నవి. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబ సభ్యుల హింసను తట్టుకోలేక శారిరకంగా, మానసికంగా వృద్ధులు కుంగిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రపంచంలోని ప్రతి ఆరుగురు వృద్ధుల్లో ఒకరు కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణకు గురవుతూ మానసిక క్షోభను అనుభ విస్తున్నారు. వయోవృద్ధులకు కొడుకులు మరియు కోడళ్ళ నుంచే వేధింపులు ఎక్కువవుతున్నాయి.వృద్ధులను వేధిస్తున్న వారిలో 56 శాతం మంది కొడుకులు,13 శాతం మంది కోడళ్ళు ఉంటున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నవి. వృద్ధులను కన్న కొడుకులే వేధింపులకు,నిరాదరణకు గురి చేయడం బాధాకరమైన విషయం. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల హింసను, నిరాదరణను భరించలేక వృద్ధులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడమో లేదా ఆత్మహత్యకు పాల్పడడం చేస్తున్నారు.
దేశంలో వృద్ధుల సంఖ్య 2036 నాటికి భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ‘‘ఇండియా ఎంగేజ్ రిపోర్ట్’’ వెల్లడించి ంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుచూపుతో వృద్ధుల సంరక్షణకు మెరుగైన వసతులు కల్పించి వారి సంక్షేమం కొరకు పలు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కలదు. వృద్ధులకు సంబంధించిన చట్టాలను సమర్ధవంతంగా అమలుపరిచి వారికి సామాజిక పింఛన్లు అందిం• •డంతోపాటు, మెరుగైన వైద్య సేవలను అందించాలి. కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి వృద్ధులకు రక్షణ కల్పించి వారు హుందాగా గౌరవంగా జీవించే పరిస్థితులను కల్పించాలి. వృద్ధులకు వారికి గల హక్కుల గురించి అవగాహన కల్పించే ందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.వివిధ రకాల సమస్యలు ఉన్న వృద్ధులకు అవసరమైన సహాయ సహకా రాలు అందించి వారికి సంతోషకరమైన, ఆరోగ్య కరమైన జీవితాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ‘14567 హెల్ప్ లైన్’ కాల్ సెంటర్ సేవలను ప్రారంభించింది.దీనిని స్పుర్తిగా తీసుకొని కేంద్రం కూడా దేశవ్యాప్తంగా ఈ హెల్ప్ లైన్ సేవలను అమలుపరుస్తున్నది, వృద్ధులకు గౌరవనీయమైన జీవితాన్ని అందించేందుకు హెల్ప్ లైన్ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా కృషి చేస్తున్నది. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా అమలుప రుస్తున్నవి. ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 17 మొబైల్ మెడికేర్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ యూనిట్లు మురికివాడల్లో, గ్రామాల్లో తిరుగుతూ వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు తగిన సలహాలు సూచనలు అందిస్తూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తూ తగిన సలహాలు సూచనలు చేస్తుంటారు.
వయోవృద్ధుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఆర్డీవో ట్రైబ్యునల్ లను కూడాఏర్పాటు చేసింది.ఈ ట్రైబ్యునల్ లకు జ్యూడిషల్ అధికారాలు కూడా ఉంటాయి. వారసులు, రక్తసంబంధీకులు వయోవృద్ధులను పట్టించుకోకుండా ఆస్తులు రాయించుకుని, బాగోగులు చూడకుండా వంతుల పేరిట వేధించిన న్యాయం కొరకు ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చు.అదేవిధంగా వారసుల నుంచి నెల నెల మెయింటెనెన్స్ కూడా కోరవచ్చు.
వృద్ధాప్యం అనునది ప్రతి ఒక్కరి జీవితంలో ఆహ్వాని ంచతగిన అనుభవంగా మారాలంటే వారి ఆరోగ్యానికి, జీవనశైలికి ఖచ్చితమైన భరోసా ఉండాలి. వృద్ధుల కొరకు ప్రత్యేకమైన హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసి వారికి ఉచితంగా నర్సింగ్ సేవలను మరియు మందులను అందజేయాలి. ముఖ్యంగా ఇండ్లలో ఉండలేని వారికి ప్రభుత్వమే వృదా్ధ శ్రమాలు ఏర్పాటు చేసి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలి. వారిని జాతి సంపదగా భావించి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కలదు.వారి అనుభవాలను, సామర్థ్యాలను అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారు.ఆధునిక సాంకేతికను కూడా వారికి చేరువ చేయాలి.’నేటి యువతే రేపటి వయోజనులనే’విషయం మరవరాదు.వృద్ధులపై వేధింపులు లేకుండా వారు ఆనందంగా ఆరోగ్యంగా జీవించేలా చూసినప్పుడే మనం సమాజంలో సగర్వంగా తలెత్తుకోగలం అనే విషయాన్ని మరవరాదు.వృద్ధులు అంటేనే మరో బాల్యమని వారిని పసిపిల్లలవలె కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై కలదనే విషయం మరువరాదు. (అక్టోబర్ 1 అంతర్జాతీయ
వయోధికుల దినోత్సవం సందర్భంగా)
పుల్లూరి వేణుగోపాల్.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు హనుమకొండ.9701047002




