నేరాభియోగ పరిధి నుంచి కార్మిక చట్టాల తొలగింపు, శ్రమ యోగులకు ఇదే రక్షణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న అమృ తకాల భారతదేశం,.. ‘సంపద సృష్టికర్తల’ను గౌరవించేందుకు ఇప్పటికే కొనసాగుతున్న కృషి.., ‘శ్రమయోగులు’ గా పేర్కొనదగిన కార్మికులకోసం జరుగుతున్న నిర్విరామ కృషి,..ఇవన్నీ వాస్తవికంగా పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఆ రెండు వర్గాల సంక్షేమం, సౌభాగ్యం ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వారి సంక్షేమంతోనే భారతదేశం పునాదులు మరింత పటిష్టపడతాయి. 2021వ సంవత్సరపు స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వ విధాన ప్రాథమ్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మఖ్యమైన ప్రకటన చేశారు. ‘‘పౌరుల జీవితాల్లో జోక్యం చేసుకోని ప్రభుత్వం మన దేశానికి అవసరమన్నది మా భావన. ప్రజలకు అడ్డంకిగా, అవాంతరంగా నిలిచే ప్రతి నిబంధన, ప్రక్రియ భారంగానే పరిణమిస్తుంది. అలాంటి వాటిని మనం తొలగించేయాల్సిందే ’’ అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. అందుకోసమే కొత్త కార్మిక చట్టాలను విలక్షణమైన రీతిలో తీర్చిదిద్దారు. వాణిజ్యాల ప్రయోజనాలను, వాణిజ్యం, వ్యాపారం కోసం పనిచేసే కార్మికుల ప్రయోజనాలను కూడా రక్షించేందుకు వీలుగా ఈ చట్టాలను తీసుకువచ్చారు. ఎప్పడికప్పుడు మారుతున్న కార్మిక మార్కెట్‌ ‌ధోరణులకు అనుగుణంగా కొత్త చట్టాలు ఉన్నాయి. అదే సమయంలో, కనీస వేతన అవసరాన్ని, స్వయంఉపాధి కార్మికులు, వలస కార్మికులతో సహా, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ అవసరాలను తీర్చే విధంగా ఈ కొత్త చట్టాలు రూపొందించాం.

బహుళ సంఖ్యలో ఉన్న అనేక చట్టాలను నాలుగు చట్టాలుగా సంక్షిప్తీకరించడంతో కార్మిక సంస్కరణలు పూర్తయ్యాయి. ప్రస్తుతం అమలులో ఉన్న కేంద్ర కార్మక చట్టాలు, అనేక అధికార కేంద్రాలు, రిజిస్ట్రేషన్లు, తనిఖీలు, లైసెన్సులు, రిజిస్టర్లు, ఫారాలు వంటి బాదరబందీలను మేం తొలగించాం. ఈ కార్మిక సంస్కరణలతో సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల సామాజిక భద్రత మరింత బలోపేతమవుతుంది. కార్మికుల సంక్షేమంలో పెనుమార్పులకు దోహదం చేసే అనేక అంశాలు కొత్త కార్మిక చట్టాల్లో ఉన్నాయి. భారతదేశంలోని ఔత్సాహిక వాణిజ్య వేత్తలను పాత కార్మిక చట్టాల పరిధిలోని అనవసరమైన నిబంధనల చట్రాలనుంచి, నిర్బంధాలనుంచి విముక్తి కలిగించడం ఈ అంశాల్లో భాగమే.

పాత నియంత్రణ చట్టాల్లోని కొన్ని క్లాజులను పరిశీలించండి:
ఫ్యాక్టరీల చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం క్యాంటీన్లకు రంగులువేయడం, వార్నిషింగ్‌ ‌చేయడం తదితర కార్యకలాపాలపై రికార్డులను నిర్వహించనందుకు 3 నెలలనుంచి సంవత్సరం వరకూ జైలుశిక్ష విధింపు. ఫ్యాక్టరీల చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం, సెలవు దినాల వార్షిక వివరాలను దఖలు పరచనందుకు ఏడాదినుంచి మూడేళ్ల పాటు జైలుశిక్ష విందించడం. 1936వ సంవత్సరపు వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం జీతాల చెల్లంపు సమాచారం నోటీసు ద్వారా ప్రదర్శించకపోయినా, అలాంటి మరిన్ని స్వల్పమైన పొరపాట్లు చేసినా 3నెలలనుంచి ఏడాది పాటు జైలుశిక్ష విధించడం. గత వందేళ్లలో రూపొందించిన వివిధ చట్టాల ఆధారంగా వీటిని అన్నింటినీ శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నారు. ఈ పాతచట్టాలన్నీ భారతదేశపు అభివృద్ధి పయనానికి అడ్డంకులుగా మారబోతాయన్న విషయాన్ని పరిశీలించినందున పార్లమెంటు 2020వ సంవత్సరంలో నాలుగు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది. 2019 సంవత్సరపు వేతనాల చట్టం, 2020వ సంవత్సరపు పారిశ్రామిక సంబంధాల చట్టం, 2020వ సంవత్సరపు సామాజిక భద్రతా చట్టం, 2020వ సంవత్సరపు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితుల చట్టం వంటి సవరణ చట్టాలను పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టాల రూపకల్పన ద్వారా,..కార్మిక చట్టాల్లోని అతి స్వభావంతో ఉన్న నేరప్రభావిత నిబంధనలను ప్రభుత్వం తొలగించివేసింది. చిన్న చిన్న నేరాలను, పొరపాట్లనే ఇన్నాళ్లూ నేరాభియోగం పరిధిలో పరిశీలించినందుకు తగిన కారణాలు ఉన్నాయి. అన్ని చట్టాల్లోనూ ప్రస్తావించిన ఓ ప్రత్యేక సెక్షన్‌ ‌కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ‘నేరాలకు సాధారణ శిక్ష’ అన్న పదజాలంతో ఈ సెక్షన్‌ను ప్రస్తావించారు. ఉదాహరణకు,..ఫ్యాక్టరీల చట్టంలో సెక్షన్‌ 92‌లో నేరాలకు సాధారణ శిక్షలను ప్రస్తావించారు. : ‘‘ఏ ఫ్యాక్టరీలో అయినా, ఈ చట్టంలోని ఏ నిబంధన ఉల్లంఘనకు గురైనట్టు ఆరోపణలు వచ్చినా, ఆ సమయాన ఫ్యాక్టరీలో ఉన్న వారు, లేదా ఫ్యాక్టరీ మేనేజర్‌తో సహా ప్రతి ఒక్కరూ నేరం చేసినట్టుగానే పరిగణించేవారు. జైలు శిక్షను అమలు జరిపేవారు. ఈ శిక్షాకాలం రెండేళ్లవరకూ పొడిగించేలా వీలుండేది. జరిమానా లక్ష రూపాయల వరకూ విధించే ఆస్కారం ఉండేది. లేదా జైలు, జరిమానా రెండూ పడేవి…’’ పర్యావరణ రక్షణ చట్టం (1986), అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టంతో సహా దేశంలోని చాలావరకూ చట్టాల్లో ‘సాధారణ శిక్ష’కు సంబంధించిన ఇలాంటి క్లాజులే ఉండేవి.

అయితే, కొత్తగా తీసుకువచ్చిన కార్మిక సవరణ చట్టాల ద్వారా జనరల్‌ ‌పెనాల్టీతో కూడిన జైలుశిక్ష నిబంధనలను తొలిగించారు. అదే సమయంలో, ఏవైనా ఉల్లంఘనలు జరిగినపుడు దాన్ని అరికట్టే యంత్రాగాన్ని సంస్థ యజమానే నిర్వహించేలా చూసేందుకు ధనరూపంలో విధించే జరిమానాలు పెరిగాయి. ఎలాంటి దురుద్దేశాలు లేకున్నా జరిగే ఆర్థిక నేరాలకు జైలుశిక్ష విధించడం మరీ తీవ్రమైన అంశం కాబట్టి ఇలాంటి యంత్రాంగం ఏర్పాటుకు చర్యతీసుకున్నారు. సులభతర వాణిజ్య సూచికల్లో భారతదేశం ముందుకు సాగేందుకు ఇలాంటి చర్యలన్నీ ఎంతగానో దోహదపడతాయి. అయితే, మరో వైపు ఈ సవరణ చట్టాలు యాజమాన్యాలను సక్రమంగా ప్రాసిక్యూట్‌ ‌చేయడానికి సరిపోవని, నేరాలు చేసే యాజమాన్యాలపట్ల ఉదాసీన వైఖరికి దారితీస్తాయనని ఆందోళనలు కూడా నెలకొన్నాయి. కానీ, దురుద్దేశాలతో వ్యవహరించే యాజమాన్యాలపట్ల ఎలాంటి ఉదాసీనతకూ ఆస్కారంలేని రీతిలో కొత్త కార్మిక చట్టాల్లో తగిన రక్షణలను కూడా పొందుపరిచారు. ఇక, బీమా, ప్రావిడెంట్‌ ‌ఫండ్‌ ‌ఖాతాలకోసం ఉద్యోగుల, కార్మికుల వేతనాలనుంచి కోత విధించిన సొమ్మును సంబంధిత ఖాతాల్లో జమచేయకపోవడం అన్న నేరాలను ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులుగా పరిగణించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే ఏర్పాట్లను కార్మిక చట్టాల్లో చేశారు. ఈ విషయంలో యాజమాన్యాలు పాల్పడే తీవ్రమైన ఉల్లంఘనలు శిక్షనుంచి తప్పించుకోకుండా చూసేందుకు కొత్త చట్టాల్లో తగిన ఏర్పాట్లను పొందుపరిచారు. అలాగే ఉద్దేశపూర్వకంగా కాక పోయినా, పొరపాటున ఉల్లంఘనకు పాల్పడిన యాజమాన్యాలు మొదటి సారి ఉల్లంఘనకు పాల్పడిన యాజమాన్యాలు అనవసరంగా తీవ్రమైన శిక్షలకు, పర్యవసానాలకు గురికాకుండా కూడా తగిన చర్యలు కూడా తీసుకున్నారు.

కొత్త కార్మిక సవరణ చట్టాల్లో మరో కొత్త నిబంధనను కూడా ప్రవేశపెట్టారు. ఏదైనా తప్పు చేసిన యాజమాన్యం లేదా సంస్థ తన తప్పులను సవరించుకుని కార్మికుడి నష్టాలను పూడ్చుకునేందుకు తగిన చర్యలు తీసుకున్న పక్షంలో, లేదా పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్న పక్షంలో అలాంటి సంస్థలకు, యాజమాన్యాలకు ఇంప్రూవ్‌మెంట్‌ ‌నోటీసును తనిఖీ అధికారి జారీ చేసేందుకు వీలుగా ఈ నిబంధనను పొందుపరిచారు. ఇలాంటి చర్యల వల్ల సహజన్యాయ సూత్రాలను ప్రోత్సహించడానికి, కార్మికుడికి, యాజమానికి మధ్య. సంబంధాలను బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే, కార్మికుల సమస్యలను పరిష్కరించడమే ఇంప్రూవ్‌మెంట్‌ ‌నోటీసు ప్రధాన లక్ష్యం. కేవలం ప్రాసిక్యూషన్‌ ‌ప్రక్రియను అమలుజరపడానికి బదులుగా,.. వేతనాల చెల్లింపు, లేదా ప్రభుత్వానికి తగిన సమాచారం అందించడం తదితర అంశాల్లో సమస్యల పరిష్కారమే ఈ నోటీసు లక్ష్యం. దీనితో ఇలాంటి స్వల్బమైన కేసుల భారం నుంచి కోర్టులకు కూడా విముక్తిని కలిగించేందుకు వీలుంటుంది.

స్వభావపరంగా ఉండే తీవ్రమైన నేరాలను మినహాయిస్తే మిగతా స్వల్ప నేరాలన్నింటినీ ఒక్కటిగా పరిగణించే పద్ధతిని తొలిసారిగా అన్ని కార్మిక చట్టాల్లోనూ పొందుపరిచారు. ఇప్పటి వరకూ ఏడాది జైలుశిక్ష పడే నేరాలు, తొలసారిగా జరిగినవి అయితే, సదరు అంశాలను ఒక ప్రత్యేక అధికారి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను కూడా కొత్త చట్టాల్లో చాలా వరకు సరళతరం చేశారు. ఉల్లంఘనలకు గాను వసూలు చేసిన జరినామాల మొత్తాన్ని ఆయా రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సామాజిక భద్రతా నిధులకు జమచేస్తారు. జమ చేసిన ఆ మొత్తాలను అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం వినియోగించవచ్చు.
కార్మిక శాఖ ఉమ్మడి జాబితాలో ఉన్నందున, కేంద్ర కార్మిక చట్టాలను నేరాభియోగాల పరిధినుంచి తొలగించినపుడు సదరు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కార్మిక నిబంధనలకు కూడా వర్తిస్తాయి. కార్మిక చట్టాలన్నింటినీ నాలుగు సవరణ చట్టాలుగా సంక్షిప్తీకరించినందున సెక్షన్ల సంఖ్య 1,228నుంచి 480కి తగ్గింది. అంటే, సెక్షన్ల సంఖ్య దాదాపు 61శాతం తగ్గిపోయింది. తొలిసారి నేరానికి గాను జైలుశిక్ష విధించేందుకు వీలు కలిగించే సెక్షన్లు కొత్త చట్టాల్లో 22 మాత్రమే ఉన్నాయి. అంత తీవ్రమైన స్వభావంలేని నేరాలను నేరాభియోగాల పరిధినుంచి తొలగించడంలో ప్రభుత్వం ఎంతో శ్రద్ధను కనబరిచింది. అలాగే, దేశంలోని కార్మికులందరికీ కనీస వేతనం, సామాజిక భద్రత వంటి ప్రయోజనాలను సార్వత్రికం చేసేందుకు కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.

స్వల్పమైన నేరాలకు, ఉద్దేశపూర్వకంగా చేయని నేరాలకు జైలుశిక్ష వంటివి విధిస్తే, అవి ఇప్పటి యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వాణిజ్య ప్రగతిలో అడ్డంకులుగా పరిణమిస్తాయి. ఇలాంటి కార్పొరేట్‌ ‌నేరాలను సాధ్యమైనంతవరకూ నేరాబియోగాల పరిధినుంచి తొలగించడం చాలా వాంఛనీయం. ఎందుకంటే, స్వదేశీ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఇలాంటవి ప్రతిబంధకాలుగా మారతాయి. కార్మిక చట్టాలను నేరాభియోగాల పరిధినుంచి తొలగించేందుకు తీసుకున్న చర్యలతో ఔత్సాహిక వాణిజ్య, పారిశ్రామిక వేత్తల మనసుల్లోనుంచి ప్రాసిక్యూషన్‌ ‌భయాలు తొలగిపోతాయి. మన యువతలోని ఔత్సాహిక క్రియాశీలత్వానికి ఇది ప్రోత్సాహకరంగా మారుతుంది. తద్వారా వారు మరిన్ని వాణిజ్య సంస్థలను నెలకొల్పేందుకు ప్రోత్సాహం లభిస్తుందిబీ చివరకు ఉపాధి కల్పనా కార్యకలాపాల విస్తృతం కావడానికి ఇది దోహదపడుతుంది. ప్రభుత్వం కూడా ఇందుకే అగ్రప్రాధాన్యం ఇస్తూవస్తోంది. యాజమాన్యాలపట్ల విశ్వాస ప్రాతిపదికతో కూడిన వైఖరిని ప్రదర్శించడం వల్ల, వారు తమతమ వాణిజ్య విధానాలను కార్మిక చట్టాలతో మమేకం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మన చట్టాలను వారు మరింత మెరుగ్గా అనుసరించేందుకు, ఉత్తమమైన మానవ వనరుల అభివృద్ధి పద్ధతులను పాటించేందుకు ఇది వీలు కలిగిస్తుంది. కొత్త కార్మిక చట్టాలు ఒకసారి పూర్తిగా అమలులోకి వస్తే, భారతదేశం అవరోధాలన్నింటినీ తొలగించుకుంటూ స్వావలంబన దిశగా ప్రధానమంత్రి మోదీ కలలుగన్న ఆత్మనిర్భర భారత్‌ ‌సాధనకోసం పురోగమించినట్టే అవుతుంది.
శ్రీ భూపేందర్‌ ‌యాదవ్‌, ‌కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *