తెలంగాణ భవన్‌కు రానున్న మాజీ ముఖ్యమంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : నేడు ఉదయం తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వొస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు, క్యాబినెట్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా బీఆర్‌ఎస్ నేతలు చర్చ జరుపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి నేటి సమావేశంలో గులాబీ నేతలు చర్చించనున్నారు.
నేడు కెఆర్‌ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై కెసిఆర్ సమీక్ష



