స్పీకర్ ఛాంబర్‌లో కార్యక్రమం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ సమక్షంలో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. కెసిఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నేడు ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణం




