నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
10న మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి
కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై వాడివేడి చర్చకు అవకాశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు గురువారం గవర్నర్‌ తమిళి సై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రేపు శుక్రవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుంది. ఇక 10న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్‌ శాఖకు సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌ విచారణ నివేదిను సభలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశం సైతం ప్రస్తావనకు వొచ్చే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాల నిర్వహరణపై సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రభుత్వ విప్‌లతో చర్చరించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇదిలావుంటే కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై విపక్ష బిఆర్‌ఎస్‌ అధికార పక్షం కాంగ్రెస్‌తో యుద్ధానికి సిద్ధం అవుతుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. గత ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టనుంది. దీంతో కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని ముందుకు తెచ్చి తిప్పికొట్టాలన్నది బిఆర్‌ఎస్‌ వ్యూహంగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *