నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలపై వాట్సాప్‌ ‌వేటు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : సవరించిన ఐటీ రూల్స్ 2021‌కి అనుగుణంగా మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ ‌యాప్‌ ‌వాట్సాప్‌ ఓ ‌సంచలన విషయం బట్టబయలు చేసింది. గతేడాది డిసెంబర్‌ 1‌వతేదీ నుంచి డిసెంబర్‌ 31‌వతేదీ వరకు అంటే నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలను వాట్సాప్‌ ‌నిషేధించినట్టు ప్రకటించింది.

అయితే మరో ముఖ్య విషయమేమిటంటే  నిబంధనలు ఉల్లంఘించిన ఈ వినియోగదారులపై వాట్సాప్‌.. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే వారి ఖాతాలను తొలగించినట్టు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారులున్న వాట్పాప్‌కు..1607 ఫిర్యాదులు అందాయని వాట్సాప్‌ ‌ప్రతినిధి చెప్పారు. వాట్సాప్‌ ‌నెల వారి నివేదికలో భాగంగానే ఐటీ  నియమం 2021 ప్రకారం హాని కరమైన ఖాతాలను తొలగించామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *